CENTRAL AGRICULTURE DEPARTMENT TEAM MEETS YS JAGAN AND APPLAUDS GOVERNMENT SCHEMES FOR FARMERS IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN
YS Jagan: ఆ విషయంలో జగన్ ను మెచ్చుకున్న కేంద్రం.. దేశవ్యాప్త అమలుకు సిద్ధం..
సీఎం జగన్ (ఫైల్)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను (Tythu Bharosa Kendas) దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల బృందం సీఎం జగన్ (AP CM YS Jagan) తో భేటీ అయింది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను (Rythu Bharosa Kendas) దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల బృందం సీఎం జగన్ (AP CM YS Jagan) తో భేటీ అయింది. కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ అహూజా, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన సీఈఓ, సంయుక్త కార్యదర్శి రితేష్ చౌహాన్, కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.సునీల్, నోడల్ ఆఫీసర్ అజయ్‌కరన్ బృందం.. సీఎంను కలిసి వివిధ అంసాలపై చర్చించింది. వ్యవసాయం, రైతు సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా యోజనతో భాగస్వామ్యం కావాలని సూత్రప్రాయ నిర్ణయించారు. .
ప్రకృతి వైపరీత్యాలు కారణంగా నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు, అలాంటి రైతులకు గరిష్ట ప్రయోజనాలు అందించేలా ఫసల్ బీమా యోజనలో చక్కటి మోడల్‌ను పొందుపరచాలని సీఎం జగన్ కేంద్ర బృందాన్ని కోరారు. ఈ మోడల్‌ను ఖరారుచేయగానే రాష్ట్రంలో కూడా అమలుకు కేంద్రంతో కలిసి భాగస్వామ్యం అవుతామని సీఎం తెలిపారు.
సీఎంతో భేటీకి ముందు గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్, అక్కడ నుంచి వణుకూరులోని రైతు భరోసా కేంద్రం, కంకిపాడులో ఇంటిగ్రేటెడ్ అగ్రిల్యాబ్‌ను కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి బృందం సందర్శించింది. అక్కడ తమ అనుభవాలను ముఖ్యమంత్రితో కేంద్ర అధికారుల సీఎంతో పంచుకున్నారు. వ్యవసాయ రంగం, రైతు సంక్షేమం కోసం వైయస్.జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను, ఆర్బీకే వ్యవస్థను మనోజ్ అహూజా కొనియాడారు.
అగ్రిల్యాబ్స్ ఏర్పాటు రైతులకు ఎంతో ప్రయోజనకరంమని.. అగ్రిల్యాబ్స్‌లో ముందస్తుగా నిర్వహిస్తున్న తనిఖీల్లో విత్తనాలు, ఎరువుల్లో కల్తీ ఉన్నట్టుగా నిర్ధారణ అయితే ఆ సమాచారాన్ని తమకు కూడా ఇవ్వాలని అహూజా కోరారు. ఇతర రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను, రైతులను హెచ్చరించడానికి, తద్వారా కల్తీల బారినుంచి రైతులను కాపాడేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. – పొలంబడి పేరుతో నిర్వహిస్తున్న శిక్షణా తరగతులనూ మెచ్చుకున్నారు.
అనేక రంగాలతో పాటు వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏపీ వినియోగించుకుంటున్న తీరు అమోఘమన్న కేంద్ర బృందం.., మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ చాలా ముందడుగులో ఉందన్న చెప్పారు. ఇ– క్రాపింగ్ ద్వారా పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నారని, తద్వారా టెక్నాలజీని మిళితం చేసి రైతులకు చక్కటి ప్రయోజనాలు అందిస్తున్నారన్నారన్నారు. ఫాంగేట్ వద్దే కొనుగోళ్లు, ఆర్బీకేల స్థాయిలోనే పంటల విక్రయం, కౌలు రైతులకు సీసీఆర్సీకార్డుల పంపిణీ అంశాన్ని అభినందించారు. ఇది దేశ వ్యాప్తంగా అమలుకు చక్కటి విధానమని అభిప్రాయపడ్డారు. సామాజిక తనిఖీలకోసం జాబితాలు ఆర్బీకేల్లో ప్రదర్శించడం కూడా చాలా బాగుందని సీఎంకు చెప్పారు. రైతు భరోసా, ఉచిత పంటల బీమా, ధరల స్థిరీకరణనిధి ఇలా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను సీఎం జగన్ కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.