హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Central Funds: బెంగాల్‌కు కేంద్రం నిధులు బంద్.. మనదాకా వస్తే కేసీఆర్, జగన్ ఏం చేస్తారో..?

Central Funds: బెంగాల్‌కు కేంద్రం నిధులు బంద్.. మనదాకా వస్తే కేసీఆర్, జగన్ ఏం చేస్తారో..?

జగన్, మోదీ, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

జగన్, మోదీ, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Centre Versus States: తాము ప్రవేశ పెట్టిన పథకాలకు పేర్లు మార్చి అమలు చేస్తున్నారంటూ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. ఈ పథకాల కింద బెంగాల్‌కు రావాల్సిన నిధులను కేంద్రం తాత్కాలికంగా నిలిపి వేసింది. అయితే దీనిపై తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చ మొదలైంది.

ఇంకా చదవండి ...

  రాష్ట్రాల మీద కేంద్రం పెత్తనం ఏంటి అనే నినాదంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్న ఈ సమయంలో.. కొత్త పరిణామం తెరపైకి వచ్చింది. ఇది ఇపుడు అన్ని రాష్ట్రాల్లోనూ బర్నింగ్ డిబేట్ గా మారింది. తాము ప్రవేశ పెట్టిన పథకాలకు పేర్లు మార్చి అమలు చేస్తున్నారంటూ వెస్ట్ బెంగాల్(West Bengal) ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. ఈ పథకాల కింద బెంగాల్ కు రావాల్సిన నిధులను కేంద్రం (Centre) తాత్కాలికంగా నిలిపి వేసింది. బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరింది.

  ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(PMAY), స్వచ్ఛ భారత్ మిషన్(rural) పథకాల యాక్షన్ ప్లాన్ వివరిస్తూ.. అమలు కోసం నిధులు మంజూరు చేయాలని జనవరి, 2022లో కేంద్రాన్ని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం కోరింది. PMAY కింద రూ.4,900 కోట్లు, రూ.2,700కోట్లు ఇవ్వాలని రిక్వెస్ట్ చేసింది. ఐతే.. ఈ పథకాల అమలుపై కొన్ని సందేహాలు వ్యక్తంచేస్తూ.. కేంద్రం రిప్లై ఇచ్చినట్టు బెంగాల్ సర్కారు ప్రతినిధి ఒకరు తెలిపారు. “పథకాలకు పేర్లు (Schemes Name)మార్చి అమలు చేస్తున్నారా... దీనికి సంబంధించిన వివరాలు ఇవ్వండి..” అంటూ బెంగాల్ ప్రభుత్వానికి సమాచారం పంపింది కేంద్రం. హౌరా పట్టణంలోని బెంగాల్ ప్రభుత్వ తాత్కాలిక సచివాలయ భవనం “నబన్నా(Nabanna)”ను వివరాలు ఇవ్వాలని తన లేఖలో కోరింది.

  బెంగాల్ ఏం చేసింది..?

  వెస్ట్ బెంగాల్ లో PMAYని బంగ్లా ఆవాస్ యోజన గా.. స్వచ్ఛ భారత్ మిషన్, ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన పథకాలను నిర్మల్ బంగ్లా మిషన్, బంగ్లా సరక్ యోజనగా మార్చి అమలు చేస్తున్నారు. ఇలా పలు కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్చి అమలుచేస్తున్న బెంగాల్ ప్రభుత్వానికి ఈ పరిణామంతో ఝలక్ తగిలినట్టయింది. ఏటా మార్చి చివర్లో గానీ.. ఏప్రిల్ మొదటి వారంలో గానీ తమకు నిధులు మంజూరు అయ్యేవనీ.. కానీ ఈసారి మాత్రం కేంద్రం డౌట్లు పంపిందని ఆ ప్రభుత్వ ప్రతినిధి చెప్పారు. 2023లో పంచాయతీ ఎన్నికలు ఉండటంతో ఏం చేయాలనేదానిపై బెంగాల్ ప్రభుత్వం ఆలోచనలో పడింది.

  తెలుగు రాష్ట్రాల్లో కాక

  కేంద్రం పథకాలు, నిధులు-అమలు అంశాలపై తెలంగాణ-ఏపీ రాష్ట్రాల్లోనూ రాజకీయ కాక పెరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణలో బలంగా, వేగంగా ఎదుగుతున్న బీజేపీ, అధికార టీఆర్ఎస్ మధ్య ఈ విషయంలో పదే పదే డైలాగ్ వార్ నడుస్తోంది.

  పథకాలపై కేంద్రం-కేసీఆర్ డిష్యూం డిష్యూం

  తెలంగాణలో పథకాలు-కేంద్రం వాటాలపై ప్రతి రోజూ వాడీ వేడి చర్చ జరుగుతూనే ఉంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం నుంచి వచ్చే నిధులతో డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టి కేవలం కేసీఆర్ పేరు ఒకటే పెట్టుకుంటున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. నగరాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన కోసం అమృత్ స్కీమ్ కింద ఇచ్చే నిధులను మిషన్ భగీరథ కోసం తెలంగాణ సర్కారు వాడుకుంటోందని వాదిస్తోంది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి రైతు వేదికలు, విలేజ్ పార్కుల్లోనూ కేంద్రం డబ్బులున్నాయనేది బీజేపీ ఆరోపణ. ఐతే.. బీజేపీ నేతలకు సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటరిస్తూ వస్తున్నారు. తెలంగాణ పథకాలనే కేంద్రం కాపీ కొడుతోందని.. మిషన్ భగీరథను ‘హర్ ఘర్ జల్’ పేరుతో అమలు చేస్తోందని.. “మందికి పుట్టిన పిల్లలను మన పిల్లలు అనుకునే బాపతు పార్టీ అది”అని గట్టిగానే విమర్శించిన సందర్భం కూడా వైరల్ అయింది.

  మరి ఏపీలో పరిస్థితి ఏంటి..?

  అటు ఏపీలోనూ సీఎం జగన్ తన మార్క్ కోసం అనేక పథకాలను తండ్రి వైఎస్ఆర్ పేరుమీద, తన పేరుమీద అమలు చేస్తున్నారు. నవరత్నాలు, జగనన్న అమ్మ ఒడి, మన బడి నాడు –నేడు, సర్వ శిక్షా అభియాన్ లో భాగంగా ‘జగనన్న విద్యా కానుక’(1నుంచి టెంత్ చదివే పిల్లలకు 3 జతల యూనిఫామ్స్, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, జత షూలు, సాక్స్ లు, బెల్ట్, స్కూల్ బ్యాగ్), మధ్యాహ్న భోజనం స్కీమ్ లో భాగంగా జగనన్న గోరుముద్ద(బెల్లం చిక్కీ, పులిహోర, పొంగలి, వెజిటబుల్ పులావ్), సంక్షేమ వసతి గృహాల పథకంలో భాగంగా జగనన్న వసతి దీవెన(డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ స్టూడెంట్స్ కు రూ.10వేల నుంచి –రూ.20వేల సాయం) లను అమలు చేస్తున్నారు.

  Actor Prithvi: జనసేనకు జై కొడుతున్న పృథ్వీ.. ఈ సడన్ ఛేంజ్ కు కారణం ఇదేనా..?

  CM KCR | Centre : రూ.40వేల కోట్ల తెలంగాణ భూములు అమ్ముకోనున్న కేంద్రం: KTR ఘాటు లేఖ

  ఇప్పుడు రాష్ట్రాలు ఏం చెప్పే చాన్సుంది..?

  ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, స్వచ్ఛభారత్ మిషన్ అమలులో కేంద్రం ఖర్చు వాటా 60శాతం. మిగతా 40శాతం ఖర్చును రాష్ట్రాలు భరిస్తున్నాయి. సంక్షేమ, మౌలిక వసతుల రంగాలకు కేటాయింపులతోనే జనాన్ని ఎక్కువగా ఆకర్షించొచ్చన్న అంచనాతో.. కేంద్రం అమలు చేస్తున్న చాలా వెల్ఫేర్ స్కీముల్లో పలు రాష్ట్రాలు తమ వాటాను, కేటాయింపులను భారీగా పెంచి.. వాటి పేర్లు అమలు చేస్తున్నాయి. ఒకప్పుడు కేంద్ర సంక్షేమ పథకాల్లో ఖర్చుల వాటా 60:40శాతంగా ఉండేది. నేడు రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు తెచ్చి మరీ ఆ స్కీముల్లో డబ్బులు కుమ్మరించి పంపిణీకి సిద్ధమైపోవడంతో.. రాష్ట్రాల వాటా 90శాతం అన్నట్టుగా మారిపోయింది. వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లను కేసీఆర్, జగన్ భారీగా పెంచేశారు. కొన్ని పథకాల్లో కేంద్రం వాటా నామమాత్రమే అన్నట్టుగా సీన్ మారింది. కేంద్రం ప్రశ్నించినా.. నిధులు ఆపేసినా... రాష్ట్రాలే అప్పులు చేసో.. ఆస్తులు అమ్మో ఆ పథకాల అమలును కొనసాగించి, ఓట్లు రాబట్టుకోవాలనుకునే విపరీత పరిస్థితి సమకాలీన రాజకీయ భారతంలో కనిపిస్తోంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, CM KCR, PM Narendra Modi, Telangana

  ఉత్తమ కథలు