Vijayawada Indrakeeladri Landslides: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగిపడిన దృశ్యాలు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తం అయ్యాయి.

news18-telugu
Updated: October 21, 2020, 10:36 PM IST
Vijayawada Indrakeeladri Landslides: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగిపడిన దృశ్యాలు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగిపడిన దృశ్యం
  • Share this:
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగిపడ్డాయి. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బీటలు వారి కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. రెండు మూడు రోజుల్లో అక్కడి కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని ఇంజనీరింగ్‌ అధికారులు ముందే హెచ్చరించారు. అయితే బుధవారమే కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొండ చరియలు విరిగిపడటంతో ఓ రేకుల షెడ్డు పూర్తిగా ధ్వంసమైంది. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ఆ కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలోనే మీడియా వారి కోసం మీడియా పాయింట్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ కొన్ని సీసీ టీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ప్రమాదకరంగా ఉందంటూ కొందరు మీడియా ప్రతినిధులు ఈవో దృష్టికి తీసుకుని వెళ్లారు. అయితే, అలాంటిదేమీ జరగబోదని, భయపడాల్సిన అవసరం లేదని ఈవో సురేష్ బాబు చెప్పిన కొన్ని గంటల్లోనే కొండచరియలు విరిగిపడ్డాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తం అయ్యాయి. అప్పటి వరకు హడావిడిగా ఉన్న ప్రాంతం కొండచరియలు విరిగిపడిన సందర్భంలో అక్కడున్న వారు పరుగులు పెట్టిన దృశ్యాలు కూడా కనిపించాయి. అదే సమయంలో కొండరాళ్ల కింద ఎవరైనా చిక్కుకుంటే వారిని రక్షించడానికి పోలీసులు, మరికొందరు వెనక్కు పరిగెట్టిన దృశ్యాలు కూడా ఉన్నాయి.

కొండచరియలు పడిన ఘటనలో ముగ్గురు గాయపడ్డారని దుర్గగుడి ఈవో సురేశ్ బాబు తెలిపారు. ఆలయ అధికారి, కానిస్టేబుల్‌, పారిశుద్ధ్య కార్మికురాలు గాయపడ్డారని స్పష్టం చేశారు. కొండచరియలు పడిన ఘటనలో అధికారుల నిర్లక్ష్యం లేదని పేర్కొన్నారు. మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించేందుకు రాబోయే కొంత సేపటి ముందు ఈ దుర్ఘటన జరిగింది. దీంతో అధికారులు కంగారుపడ్డారు. వెంటనే రోడ్డు క్లియర్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ, అక్కడ షెడ్డు ఉండడంతో సహాయకచర్యలకు ఆటంకం కలిగింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో మార్గంలో అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. మొత్తానికి ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా బుధవారం మూలా నక్షత్రం రోజున విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను, పసుపు కుంకుమలను సమర్పించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ప్రకాశం బ్యారేజీ మీదుగా సీఎం వైఎస్ జగన్ దుర్గగుడికి చేరుకున్నారు. వేదపండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో జగన్‌కు ఘనస్వాగతం పలికారు. కొండమీదకు చేరుకున్న సీఎం జగన్‌ కొండచరియలు విరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. సహాయక చర్యలను అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. అనంతరం వస్త్రధారణ పంచెకట్టు, తలపాగా చుట్టి అమ్మవారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. సీఎం జగన్‌ వెంట మంత్రి కొడాలి నాని కూడా ఉన్నారు. మరోవైపు దుర్గగుడి అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.70 కోట్లు ప్రకటించారని ఆలయ చైర్మన్‌ పైలా సోమినాయుడు పేర్కొన్నారు. లడ్డూ పోటు, ఘాట్‌రోడ్‌ అభివృద్ధి, సోలార్‌ సిస్టమ్‌తో పాటు అభివృద్ధి పనులకు సీఎం నిధులు ప్రకలించారని తెలిపారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 21, 2020, 10:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading