హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CBN - Chiranjeevi : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బర్త్ డే విషెస్ తెలియజేసిన చిరంజీవి..

CBN - Chiranjeevi : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బర్త్ డే విషెస్ తెలియజేసిన చిరంజీవి..

HBD Chandrababu Naidu - Chiranjeevi : ఏపీ మాజీ ముఖ్యమంత్రి మరియు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు 73వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు ఆయనకు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కూడా చంద్రబాబుకు బర్త్ డే విషెస్ తెలియజేసారు.

ఇంకా చదవండి ...

  CBN - Chiranjeevi : టీడీపీ (TDP) అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు ఈ రోజు 73వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.  ఈ సందర్భంగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు, చంద్రబాబు నాయుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నేటితో ఆయన 73వ ఏట అడుగుపెడుతున్నారు. ఈ వయసులోనూ యువ ప్రత్యర్థి, వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ తో పోరాటానికి ఢీఅంటే ఢీ అంటున్నారు చంద్రబాబు. తన పుట్టినరోజున కూడా రాజకీయ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. పుట్టినరోజు సందర్బంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. దేశ విదేశాల్లోని టీడీపీ శ్రేణులు, చంద్రబాబు అభిమానులు బుధవారం భారీ కార్యక్రమాలు తలపెట్టారు. అధినేత పుట్టినరోజుకు సర్ ప్రైజ్ గిఫ్ట్ లాగా టీడీపీ ‘చంద్రన్న కథాగానం’ పేరుతో రూపొందించిన పాట ప్రస్తుతం నెట్టంట హల్ చల్ చేస్తోంది.

  చంద్రబాబును శివుడితో, మునితో పోల్చుతూ ఆ పాట సాగుతుంది. చంద్రబాబు విషయానికొస్తే.. అప్పట్లో కేంద్రంలో యునైటైడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా.. నేషనల్ డెమెక్రటిక్ ఫ్రంట్ కన్వీనర్‌గా కేంద్రంలో చక్రం తిప్పిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు నేతృత్వం వహిస్తోన్న టీడీపీ ఉనికి కోసం పోరాడుతోంది. తెలంగాణలో ఇప్పటికే పార్టీ తుడిచిపెట్టుకొని పోయింది. ఇక రాబోయే ఎలక్షన్స్‌లో ఏపీలో అధికారంలోకి రాకపోతే.. అంతే సంగతలుంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందుకే ఈ వయసులో కూడా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు.

  RRR 26 Days WW Collections : ఆర్ఆర్ఆర్ 26 డేస్ వాల్డ్ వైడ్ కలెక్షన్స్.. మంచి వసూళ్లనే రాబట్టిన మూవీ..

  ఇక చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేసారు. చిరు విషయానికొస్తే.. మరోవైపు సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి కూడా మాజీ ముఖ్యమంత్రికి కలకాలం సంపూర్ణ ఆయురాగోగ్యాలతో ఉండాలని, అలా ఆశీర్వదించమని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.

  పుట్టినరోజు నాడు చంద్రబాబు భారీ ప్రణాళికతో సిద్ధమయ్యారు. ఇవాళ ఉదయం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు.. ఆ తర్వాత మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి నాయకులు, కార్యకర్తల్ని కలుసుకున్నారు. వారి యోగక్షేమాలను విచారించారు.  మధ్యాహ్నం తర్వాత ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం నెక్కలగొల్లగూడెం గ్రామంలో నేడు చంద్రబాబు పర్యటించనున్నారు. సాయంత్రం నెక్కలంగొల్లగూడెం గ్రామానికి చేరుకుంటారు. కొందరి ఇళ్లకు వెళ్లి స్థానికులతో మాట్లాడతారు. వారి సమస్యలు తెలుసుకుంటారు. అనంతరం గ్రామసభ నిర్వహిస్తారు. స్థానికులతో సహపంక్తి భోజనం చేస్తారు.

  KGF 2 - 6 Days WW Collections : 6వ రోజు కూడా తగ్గని కేజీఎఫ్ 2 దూకుడు.. బాక్సాఫీస్ దగ్గర యశ్, ప్రశాంత్ నీల్ మాయా జాలం..

  ఏపీలో ఎన్నికలకు మరో రెండేళ్లు మాత్రమే మిగిలి ఉండటంతో రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా చంద్రబాబు మరో ప్రజా ప్రస్థానానికి శ్రీకారం చుట్టబోతున్నారు. మే మొదటి వారం నుంచి పూర్తిస్థాయిలో పర్యటనలు మొదలుకానున్నాయి. మహానాడు తర్వాత ప్రతి నెల రెండు జిల్లాల చొప్పున... ఏడాదిపాటు రాష్ట్రమంతా పర్యటించేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. రోడ్డు షోల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలా, గ్రామ సభలు నిర్వహించాలా అనే అంశంపై పార్టీ నాయకులతో చర్చించాక నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే టీడీపీ వైసీపీ ధరల శరాఘాతాలపై ‘బాదుడే బాదుడు’ పేరుతో భారీ నిరసనలు కొనసాగిస్తున్నది.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Chandrababu Naidu, Chiranjeevi, TDP, Tollywood

  ఉత్తమ కథలు