Home /News /andhra-pradesh /

CBI TOOK KEY STEP TO INVESTIGATE YS VIVEKANDA REDDY MURDER CASE AS HIGHER OFFICIAL CAME TO KADAPA FULL DETAILS HERE PRN

YS Viveka Murder Case: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు.. రంగంలోకి కీలక అధికారి..?

వైఎస్ వివేకా (ఫైల్)

వైఎస్ వివేకా (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Viveka Murder Case) హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది.

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Viveka Murder Case) హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఇప్పటికే రెండు మూడు దఫాలుగా విచారించిన సీబీఐ.. కేసు విషయాన్ని ఓ కొలిక్కి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో విచారణలో వేగాన్ని పెంచేందుకు సీబీఐ సిద్ధమైంది. వివేకా హత్య కేసు కీలక దశకు చేరుకున్న సమయంలో దిల్లీ నుంచి సీబీఐ డీఐజీ చౌరాసియా కడపకు వచ్చారు. వివేకా హత్య కేసు కీలక దశకు చేరుకున్న సమయంలో సీబీఐ ఉన్నతాధికారి రావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. శుక్రవారం కడప చేరుకున్న చౌరాసియా సీబీఐ విచారణ బృందంతో సమావేశమై కేసు పురోగతిపై చర్చించినట్లు తెలుస్తోంది.

    సీబీఐ వివేకా హత్య కేసులో ఇప్పటికే రెండు చార్జీషీట్లను కోర్టులో దాఖలు చేసిన సీబీఐ.. ఐదుగురిని నిందితులుగా చేర్చింది. అలాగే ఈ కేసులో మరికొందరి ప్రమేయం ఉందని ప్రస్తావించిన తరుణంలో త్వరలో అరెస్టు జరిగే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగు సాగుతోంది. ఇదే సమయంలో సీబీఐ డీఐజీ కడపకు రావడం కేసులో దూకుడు పెంచారని అర్ధమవుతోంది. ఆయన వారం రోజులపాటు కడపలోనే ఉండి విచారణ ప్రక్రియపై మరింత దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.

    ఇది చదవండి: చిత్తూరు జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం


    ఇదిలా ఉంటే వివేకా డ్రైవర్ దస్తగిరి వేసిన అప్రూవర్ పిటిషన్ హైకోర్టు సమర్ధించిన నేపథ్యంలో కేసులో అతడు ఇచ్చిన వాంగ్మూలం మరింత కీలకం కానుంది. ఇప్పటికే ఈ కేసులో ఎర్రగంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డిలు ప్రధాన నిందితులుగా ఉండగా.. కడప ఎంపీ అవినాష్ రెడ్డిపైనా ఆరోపణలు వినిపించాయి. ఆయన పేరును సీబీఐ ఛార్జ్ షీట్ లో చేర్చినట్లు ప్రచారం కూడా జరిగింది.

    ఇది చదవండి: జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఈ లిస్టులో ఉన్నది వీళ్లే..!


    తాజాగా కేసు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. హత్య కేసులో ఏ-1 నిందితుడు ఎర్ర గంగిరెడ్డి పులివెందుల కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సిట్-1, సిట్-2 దర్యాప్తు నివేదికలు కోర్టుకు సమర్పించేలా సీబీఐని ఆదేశించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. సీఆర్పీసీ 207 సెక్షన్ ప్రకారం నివేదికలిచ్చేలా ఆదేశాలు ఇవ్వాలనిని విజ్ఞప్తి చేశారు. ఎర్రగంగిరెడ్డి పిటిషన్ పై పులివెందుల కోర్టులో సీబీఐ కౌంటర్‌ దాఖలు చేసింది.

    ఇది చదవండి: భారతి కూడా ఆ లిస్టులో చేరడం ఖాయం.. సీఎం జగన్ పై టీడీపీ నేత సంచలన కామెంట్స్..


    మరోవైపు ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి హస్తముందని.. ఆయన వెనుక సీఎం జగన్ ఉన్నారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలోనూ ఇదే ఉందని..ఈ వ్యవహారంలో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు వార్తలు వస్తున్నాయి. రాజకీయ కక్షతోనే వివేకాను హతమార్చారని చెబుతుండగా.. ఓ సెటిల్మెంట్ కి సంబంధించిన డబ్బు విషయంలో వివాదం కారణంగా ఆయన్ను చంపేశారని కూడా వార్తలు వచ్చాయి.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, CBI, Ys viveka murder case

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు