సెక్యూరిటీ ఇబ్బందులు... కోర్టుకు సీఎం జగన్ విజ్ఞప్తి... తీర్పు వాయిదా

అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న సీఎం జగన్ పిటిషన్‌పై తీర్పును వచ్చే నెల 1కి వాయిదా వేసింది.

news18-telugu
Updated: October 18, 2019, 4:25 PM IST
సెక్యూరిటీ ఇబ్బందులు... కోర్టుకు సీఎం జగన్ విజ్ఞప్తి... తీర్పు వాయిదా
సీఎం వైఎస్ జగన్
news18-telugu
Updated: October 18, 2019, 4:25 PM IST
ఆస్తుల కేసు విచారణ సందర్భంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ పూర్తయ్యింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో వారానికోసారి కోర్టుకు హాజరుకావడానికి సెక్యూరిటీ ఇబ్బందులు వస్తాయని ఆయన తరపున న్యాయవాది కోర్టులో వాదించారు. గతంలో జగన్ వ్యక్తిగత హోదాలో పిటిషన్ వేశారని... ఇప్పుడు ఆయన సీఎం స్థానంలో ఉన్నారని కోర్టుకు తెలిపారు. దీంతో పాటు రెండో రోజుల సమయం వృధా అవుతుందని కోర్టుకు వివరించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా కూడా భారమవుతుందని అన్నారు.

అనంతరం వాదనలు వినిపించిన సీబీఐ తరపు న్యాయవాది... జగన్‌కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వొద్దని కోర్టును కోరారు. గతంలో సీబీఐ కోర్టు, హైకోర్టు అన్ని అంశాలు పరిశీలించాయని... ఆ తరువాత వ్యక్తిగత హాజరు మినహాయింపు నిరాకరించాయని గుర్తు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు... తీర్పును నవంబర్ 1కి వాయిదా వేసింది.


First published: October 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...