సీబీఐ కోర్టులో సీఎం వైఎస్ జగన్‌కు చుక్కెదురు

తనకు బదులుగా జగతి పబ్లికేషన్స్ ప్రతినిధి హాజరయ్యేందుకు అవకాశమివ్వాలన్న సీఎం జగన్‌ను పటిషన్‌ను కొట్టివేసింది సీబీఐ కోర్టు.


Updated: January 24, 2020, 5:42 PM IST
సీబీఐ కోర్టులో సీఎం వైఎస్ జగన్‌కు చుక్కెదురు
వైఎస్ జగన్
  • Share this:
ఏపీ సీఎం జగన్‌కు సీబీఐ కోర్టులో మరోసారి చుక్కెదురయింది. ఈడీ కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని జగన్ వేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. తనకు బదులుగా జగతి పబ్లికేషన్స్ ప్రతినిధి హాజరయ్యేందుకు అవకాశమివ్వాలన్న సీఎం జగన్‌ను పిటిషన్‌ను కొట్టివేసింది సీబీఐ కోర్టు. ఇప్పటికే సీబీఐ కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపును తిరస్కరించిన కోర్టు.. తాజాగా ఈడీ కేసుల్లో దాఖలు చేసిన పిిటిషన్‌నూ కొట్టివేసింది.

అక్రమాస్తుల కేసుల్లో ఈడీ దాఖలు చేసిన ఐదు ఛార్జిషీట్లలో సీఎం జగన్‌ A-1గా ఉన్నారు. ఆ కేసుల్లో తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఐతే జగన్ విజ్ఞప్తిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభ్యంతరం వ్యక్తం చేసింది. తీవ్రమైన ఆర్థిక నేరాల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులు తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాల్సిందేనని వాదనలు వినిపించింది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం ఈడీ వాదనను సమర్థిస్తూ.. జగన్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఇక ఇవాళ జరిగిన విచారణ నుంచి అంతకుముందే మినహాయింపు లభించడంతో జగన్ కోర్టుకు రాలేదు. ఎంపీ విజయసాయిరెడ్డి, ఇందూ శ్యామ్‌ప్రసాద్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి విచారణకు హాజరయ్యారు.


First published: January 24, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు