CBI COURT ALLOWS AP CM YS JAGAN TO GO TO DAVOS FOR WORLD ECONOMIC FORUM 2022 FULL DETAILS HERE PRN
YS Jagan: సీఎం జగన్ కు సీబీఐ కోర్టు గుడ్ న్యూస్.. దావోస్ పర్యటనకు గ్రీన్ సిగ్నల్..
సీఎం జగన్ (ఫైల్)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (AP CM YS Jagan) ఈనెల 22న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు (World Economic Forum-2022) కు స్విట్జర్లాండ్ లోని దావోస్ వెళ్తున్న సంగతి తె
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (AP CM YS Jagan) ఈనెల 22న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు (World Economic Forum-2022) కు స్విట్జర్లాండ్ లోని దావోస్ వెళ్తున్న సంగతి తెలిసిందే. ఐతే సీబీఐ కోర్టులో విచారణ ఎదుర్కొంటున్న సీఎం జగన్ దేశం విడిచివెళ్లరాదని గతంలోనే కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయన శుక్రవారం కోర్టులో పిటిషన్ వేశారు. సీఎంగా అధికారిక పర్యటనకు దావోస్ వెళ్లేందుకు అనుమతివ్వాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఇరువైపుల వాదనలు విన్న సీబీఐ న్యాయస్థానం జగన్ దావోస్ వెళ్లేందుకు అనుమతిచ్చింది. ఈ నెల 19వ తేదీ నుంచి 31వరకు విదేశీ పర్యటనకు వెళ్లొచ్చని కోర్టు స్పష్టం చేసింది. దీంతో సీఎం పర్యటనకు లైన్ క్లియర్ అయినట్లయింది.
ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి హోదాలో సీఎం జగన్ తొలిసారి అధికారికంగా విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 22 నుంచి 26వరకు స్విట్డర్లాండ్ (Switzerland) లోని దావోస్ లో జరగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు జగన్ నేతృత్వంలోని బృందం హాజరుకానుంది. రాష్ట్రానికి పెట్టుబడుల తీసుకురావడమే లక్ష్యంగా సీఎం పర్యటన ఉండబోతోంది. ఈ సదస్సులో సీఎం అధ్యక్షతన 13 అత్యున్నత ద్వైపాక్షిక సమావేశాలు, 35కి పైగా అత్యున్నత స్థాయి సమావేశాలు జరగనున్నట్లు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ తెలిపారు. ప్రపంచ నలుమూలల నుంచి 2,200 మంది పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ నాయకులు, ఆర్థికవేత్తలు సదస్సుకు హాజరవుతున్నారు. డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ క్లాస్ ష్వాబ్ సమక్షంలో ఏపీ ప్రభుత్వం పలు ఒప్పందాలు కుదుర్చుకోనుంది.
దావోస్ పర్యటనలో సీఎం జగన్ ప్రధానంగా 3 కీలక సమావేశాలలో భాగస్వామ్యం కానున్నారు. 23న తేదీన వైద్యరంగంపై కీలక సమావేశం నిర్వహిస్తారు. 24వ తేదీన విద్య, నైపుణ్య రంగాలపై అత్యున్నత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. 24వ తేదీన డీకార్బనైజ్డ్ ఎకానమీ దిశగా మార్పుపై సమావేశంలో పాల్గొంటారు. ఈ పర్యటనకు సీఎం వెంట మంత్రులు గుడివాడ అమర్ నాథ్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎంపీ పివి మిథున్ రెడ్డి, ఏపిఐఐసి ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు దావోస్ వెళ్తున్నారు.
“ప్రజలు , పురోగతి , అవకాశాలు” అనే నేపథ్యంతో ప్రపంచ వేదికగా ఏపీలో ఉన్న అపార అవకాశాలను చాటేందుకు దావోస్ వెళుతున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి అమర్ నాథ్ వెల్లడించారు. డబ్ల్యూఈఎఫ్ అధ్యక్షుడు బోర్జ్ బ్రెండే ఆహ్వానం మేరకు హాజరవుతున్న ఏపీ ఈ సారి ప్రత్యేక ప్రణాళిక కసరత్తులతో ఆర్భాటాలు లేకుండా వెళుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. 2,200 మంది పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ నాయకులు, ఆర్థికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన నిష్ణాతుల ఆధ్వర్యంలో మే 22 నుంచి 26 వరకూ వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు జరుగుతుందన్నారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.