Jagan Bail: జగన్ బెయిల్ రద్దు చేయాలన్న రఘురామ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ.. తాజా పరిణామం ఏంటంటే..

జగన్, సీబీఐ కోర్టు, రఘురామరాజు

అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టులో నేడు విచారణ జరిగింది. సీబీఐ కోర్టులో జగన్ తరపు లాయర్లు కౌంటర్ దాఖలు చేశారు. జగన్ బెయిల్ షరతులను ఎక్కడా ఉల్లంఘించలేదని, సీబీఐని ప్రభావితం చేస్తున్నారన్న పిటిషనర్ వాదనలో నిజం లేదని ఆ అఫిడవిట్‌లో జగన్ తరపు లాయర్లు కోర్టుకు వివరించారు.

 • Share this:
  అమరావతి: అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టులో నేడు విచారణ జరిగింది. సీబీఐ కోర్టులో జగన్ తరపు లాయర్లు కౌంటర్ దాఖలు చేశారు. జగన్ బెయిల్ షరతులను ఎక్కడా ఉల్లంఘించలేదని, సీబీఐని ప్రభావితం చేస్తున్నారన్న పిటిషనర్ వాదనలో నిజం లేదని ఆ అఫిడవిట్‌లో జగన్ తరపు లాయర్లు కోర్టుకు వివరించారు. పిటిషనర్ రఘురామరాజుకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని జగన్ తరపు లాయర్ తెలిపారు. ఇలాంటి కేసుల్లో థర్డ్ పార్టీ జోక్యం చేసుకోకూడదని అత్యున్నత న్యాయస్థానం తీర్పులు స్పష్టం చేశాయని గుర్తుచేశారు. వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన రఘురామరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని లోక్‌సభ స్పీకర్‌కు సదరు పార్టీ సభ్యులు లేఖ కూడా రాసినట్లు కోర్టుకు వివరించారు. రఘురామరాజుపై ఆంధ్రప్రదేశ్‌లోని పలుచోట్ల అనేక కేసులున్నాయని, తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం కోర్టును వినియోగించుకోవాలని ఆయన భావిస్తున్నారని జగన్ తరపు న్యాయవాది చెప్పుకొచ్చారు. ఏపీ ముఖ్యమంత్రిగా ఎన్నికైన జగన్మోహన్‌రెడ్డి సీఎంగా ప్రభుత్వపరమైన బాధ్యతలు నిర్వహించాల్సి ఉండటం, అనేక కార్యక్రమాల్లో భాగం కావాల్సి రావడం వల్లే ఆయన కోర్టుకు హాజరుకాలేకపోతున్నారని.. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వాధినేతగా అనేక కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును హైకోర్టు కూడా ఆమోదించిందని జగన్ తరపు లాయర్లు గుర్తుచేశారు. వ్యక్తిగత హాజరు మినహాయింపును వేరే కోణంలో చూస్తూ సీబీఐని ప్రభావితం చేస్తున్నారని చెప్పడం చట్టవిరుద్ధమని జగన్ తరపు న్యాయవాదులు కౌంటర్ పిటిషన్‌లో పేర్కొన్నారు.

  ఇదిలా ఉంటే.. జగన్ బెయిల్ రద్దు అంశాన్ని సీబీఐ.. కోర్టు నిర్ణయానికే వదిలేసింది. జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసిన సీబీఐ.. పిటిషన్ మెరిట్స్ ఆధారంగా గౌరవ కోర్టు నిర్ణయం తీసుకోవాలని కోరింది. జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై కౌంటర్లను పరిశీలించిన సీబీఐ కోర్టు రఘురామ పిటిషన్‌పై తదుపరి విచారణను జూన్ 14కి వాయిదా వేసింది. వైసీపీ నుంచి ఎంపీగా గెలుపొందిన రఘురామ రాజు కొన్ని నెలలుగా నేరుగా సీఎం జగన్‌పైనే విమర్శలు ఎక్కుపెట్టిన సంగతి తెలిసిందే. విమర్శలు శృతి మించాయని అధికార వైసీపీ భావించిన తరుణంలో ఇటీవల రఘురామను దేశద్రోహం కేసులో ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

  ఇది కూడా చదవండి: Tammineni Seetharam: జ్వరంతో మళ్లీ ఆసుపత్రిలో చేరిన ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం

  హైదరాబాద్‌‌లోని ఆయన నివాసానికి వెళ్లిన సీఐడీ అధికారులు ఆయనకు నోటీసులిచ్చి.. అరెస్ట్ చేసిన విషయం విదితమే. రఘురామ అరెస్ట్ జరిగిన తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వైసీపీ శ్రేణులు రఘురామ అరెస్ట్‌ను స్వాగతించగా, టీడీపీ, జనసేన పార్టీలు ఆయన అరెస్ట్‌ను ఖండించాయి. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించారన్న అభియోగాలతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై 124(A), 153(B), 505 IPC, 120(B) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అరెస్ట్ అనంతరం కూడా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తనను పోలీసులు కొట్టి హింసించారని, అరికాళ్లను రఘురామ చూపించడం పెను దుమారం రేపింది. ఈ కేసులో రఘురామకు సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
  Published by:Sambasiva Reddy
  First published: