Home /News /andhra-pradesh /

లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ.. చంద్రబాబు, లోకేశ్‌పై కేసు..

లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ.. చంద్రబాబు, లోకేశ్‌పై కేసు..

ఓం ప్రతాప్ మృతికి వైసీపీ నేతలే కారణమని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపణలు గుప్పించారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

ఓం ప్రతాప్ మృతికి వైసీపీ నేతలే కారణమని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపణలు గుప్పించారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

లాక్‌డౌన్ నిబంధనలను చంద్రబాబు, లోకేశ్‌లు ఉల్లంఘించారంటూ ఓ న్యాయవాది నందిగామ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ న్యాయవాది, వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి బర్రె శ్రీనివాసరావు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇంకా చదవండి ...
    కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను విధించిన సంగతి తెలిసిందే. ఆ లాక్‌డౌన్ నిబంధనల్లో భాగంగా ప్రధానంగా భౌతికదూరం, మాస్కుల వినియోగం తప్పనిసరిగా పాటించాల్సిందే. అయితే మే 25న హైదరాబాద్ నుంచి విజయవాడకు రోడ్డు మార్గంలో వెళ్లారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ నిబంధనలను చంద్రబాబు, లోకేశ్‌లు ఉల్లంఘించారంటూ ఓ న్యాయవాది నందిగామ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ న్యాయవాది, వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి బర్రె శ్రీనివాసరావు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వారిద్దరితో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
    Published by:Narsimha Badhini
    First published:

    Tags: Andhra Pradesh, Nara Lokesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు