Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    నకిలీ పత్రాలతో ఎస్ఐ జాబ్.. 6 ఏళ్ల పాటు విధులు.. చివరిగా ఇలా దొరికాడు..

    ఎస్ఐ తీరుపై అనుమానం వచ్చిన ఎంపీడీవో.. ఆయన గురించి ఆరా తీశారు. తప్పుడు ధృవపత్రాలతో ఎస్ఐ ఉద్యోగం సంపాదించినట్లు తెలియడంతో.. వెంటనే గుంటూరు రేంజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు.

    news18-telugu
    Updated: October 7, 2020, 1:34 PM IST
    నకిలీ పత్రాలతో ఎస్ఐ జాబ్.. 6 ఏళ్ల పాటు విధులు.. చివరిగా ఇలా దొరికాడు..
    గోగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
    • Share this:
    నకిలీ ధృవపత్రాలతో అధికారుల కళ్లు గప్పి ఎస్‌ఐ ఉద్యోగం సంపాదించాడు. ఆరేళ్ల పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విధులు నిర్వర్తించాడు. ఐతే చివరకు ఓ గొడవ కారణంగా మనోడి నకిలీ బాగోతం బట్టబయలింది. ఏపీలోని గుంటూరు జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. గోగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో అటాచ్‌మెంట్ ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. తొలుత అగ్నిమాపక శాఖలో పనిచేసిన ప్రభాక రెడ్డి.. 2011 ఎస్ఐ రిక్రూట్మెంట్‌లో పాల్గొని అర్హత సాధించారు. అనంతరం తన ధ్రువపత్రాలను ఏలూరు రేంజి ఐజీ కార్యాలయంలో అందజేశారు. ఐతే రిక్రూట్మెంట్ సమయానికి రెండేళ్లు వయస్సు అధికంగా ఉన్న ప్రభాకర్ రెడ్డి.. తాను ఎన్సీసీలో ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేసినట్లు నకిలీ ధ్రువపత్రాలు సమర్పించారు. ఎన్సీసీ ఇన్‌స్ట్రక్టర్‌కుకు మూడేళ్ల వయసు సడలింపు అవకాశముంటుంది. తద్వారా 2014లో ఎస్ఐ‌గా పోస్టింగ్ సాధించారు ప్రభాకర్ రెడ్డి.

    ఐతే తొలి నుంచీ ప్రభాకర్ రెడ్డిపై వివాదాలు ఉన్నాయి. ప్రకాశం జిల్లా కొమరోలులో ఎస్‌ఐగా పనిచేస్తున్న క్రమంలో అక్కడ ఎంపీడీవోతో గొడవ జరిగింది. ఎస్ఐ తీరుపై అనుమానం వచ్చిన ఎంపీడీవో.. ఆయన గురించి ఆరా తీశారు. తప్పుడు ధృవపత్రాలతో ఎస్ఐ ఉద్యోగం సంపాదించినట్లు తెలియడంతో.. వెంటనే గుంటూరు రేంజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రభాకర్ రెడ్డి వ్యవహారంపై స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు... విచారణ బాధ్యతలను మార్కాపురం డీఎస్పీకి అప్పజెప్పారు. ప్రభావకర్ రెడ్డి నకిలీ ధ్రువపత్రాలు సమర్పించిన విషయం వాస్తవమేనని డీఎస్పీ విచారణలో వెల్లడయింది. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారం గుంటూరులో చర్చనీయాంశమైంది. ఫేక్ సర్టిఫికెట్లతో ఓ వ్యక్తి ఎస్ఐ జాబ్ చేస్తున్నా.. ఆరేళ్ల పాటు గుర్తించకపోడం దారుణమని కొందరు నిరుద్యోగులు మండిపడుతున్నారు. మన వ్యవస్థలో ఇంత నిర్లక్ష్యం ఉందని విమర్శలు గుప్పిస్తున్నారు.
    Published by: Shiva Kumar Addula
    First published: October 7, 2020, 1:31 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading