HOME »NEWS »ANDHRA PRADESH »car over turned in tirumala ghat road karnataka devotees escape unhurt ba

Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో కారు బోల్తా

Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో కారు బోల్తా
ప్రతీకాత్మక చిత్రం

తిరుమల ఘాట్ రోడ్డులో కారు బోల్తా పడింది. రెండో ఘాట్ రోడ్డు మీద ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసింది. ఈ కారులో ఉన్న వారు ఎలాంటి ప్రాణాపాయం లేకుండా చిన్న చిన్న గాయాలతోనే బయటపడ్డారు. కారులో ఉన్నవారు కర్ణాటకకు చెందిన భక్తులుగా గుర్తించారు.

 • Share this:
  తిరుమల ఘాట్ రోడ్డులో కారు బోల్తా పడింది. రెండో ఘాట్ రోడ్డు మీద ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసింది. ఈ కారులో ఉన్న వారు ఎలాంటి ప్రాణాపాయం లేకుండా చిన్న చిన్న గాయాలతోనే బయటపడ్డారు. కారులో ఉన్నవారు కర్ణాటకకు చెందిన భక్తులుగా గుర్తించారు. ఘాట్ రోడ్డు మీద షార్ప్ టర్నింగ్ వద్ద స్పీడ్‌గా మలుపు తిప్పడంతో కారు బోల్తా పడినట్టు భావిస్తున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే, కారు బోల్తా పడిందనే సమాచారం వచ్చిన వెంటనే 108 సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులకు వైద్య చికిత్స అందించారు. అనంతరం వారిని తిరుమలలోని అశ్విని ఆస్పత్రికి తరలించారు. చిన్న గాయాలు కావడంతో అక్కడ వైద్యులు చికిత్స అందించారు. వారి ప్రాణాలకు ఎలాంటి నష్టాలు లేవని చెప్పారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

  ఇటీవల గుంటూరు జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. సత్తెనపల్లి మండలం, గండ్లూరు అడ్డరోడ్డు వద్ద 15 మంది కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఘటనలో 8 మంది తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు వెంటనే పోలీసులు, 108కు సమాచారమిచ్చారు. గాయపడ్డవారిని సత్తెనపల్లి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ఓవర్ లోడ్, వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. పొట్టకూటి కోసం కూలీ పనులకు వెళ్తున్నవారు ప్రమాదంలో గాయపడటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.  మరోవైపు ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో అదుపుతప్పిన ఓ కారు వెనక నుంచి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు ఘటనా స్థలిలోనే మరణించారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. మార్టూరు వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. మృతులను పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన సత్యానారాయణ, విజయలక్ష్మీ, కనకలక్ష్మీ, హైదరాబాద్‌కు చెందిన చిన్నబాబుగా గుర్తించారు. గాయపడ్డ వ్యక్తిని సందీప్‌గా గుర్తించారు. వీరంతా తిరుమల పర్యటన అనంతరం తిరిగి వస్తుండగా.. ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు చెప్పారు. కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతుల కుటంబాల్లో విషాద ఛాయలు
  Published by:Ashok Kumar Bonepalli
  First published:January 10, 2021, 19:56 IST

  टॉप स्टोरीज