హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Visakhapatnam: విశాఖలో రోడ్డుపై కారులో మంటలు.. హడలెత్తిన జనం

Visakhapatnam: విశాఖలో రోడ్డుపై కారులో మంటలు.. హడలెత్తిన జనం

విశాఖలో నడిరోడ్డుపై తగలబడుతున్న కారు

విశాఖలో నడిరోడ్డుపై తగలబడుతున్న కారు

విశాఖలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు నడిరోడ్డు మీద తగలబడిపోయింది. ఉన్నట్టుండి కారులో నుంచి మంటలు రావడంతో అందులో ఉన్నవారు, చుట్టుపక్కల వారు భయాందోళనలకు గురయ్యారు.

విశాఖలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు నడిరోడ్డు మీద తగలబడిపోయింది. ఉన్నట్టుండి కారులో నుంచి మంటలు రావడంతో అందులో ఉన్నవారు, చుట్టుపక్కల వారు భయాందోళనలకు గురయ్యారు. విశాఖలోని పాత గాజువాక పంతులగారి మేడ సమీపంలో ఈ ఘటన జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా కారులో మంటలు చెలరేగాయి. విశాఖ నుంచి కూర్మన్నపాలెం వెళ్లే మార్గంలో అకస్మాత్తుగా కారులో మంటలు చెలరేగాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆ కారు వద్దకు వెళ్లేందుకు అందరూ భయపడ్డారు. కారులో నుంచి మంటలు రావడం స్థానికులు ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం అందించారు. ఇంజిన్‌లో నుంచి పెద్ద ఎత్తున మంటలు రావడంతో దట్టమైన పొగ వ్యాపించింది. ఆ మార్గంలో వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ఎప్పుడైనా పేలుతుందేమోనని ఆందోళన చెందారు. కొందరు మాత్రం ఈ మంటలను చూసి భయపడితే, మరికొందరు మాత్రం అక్కడ ఆగి వీడియోలు తీసుకోవడం ప్రారంభించారు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కొందరు స్థానికులే ముందుకొచ్చి ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ప్రయత్నాలు చేశారు.

మరో ఘటనలో ఐదుగురు సజీవదహనం

ఉత్తర్ ప్రదేశ్‌లో నిన్న జరిగిన కారు ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనం అయ్యారు. ఆగ్రా సమీపంలో ఎక్స్‌ప్రెస్ వే మీద కారులో మంటలు వచ్చాయి. ఓ డీజిల్ కంటెయినర్ మలుపు తీసుకుంటున్న సమయంలో కారు వచ్చి దాన్ని వెనుక నుంచి ఢీకొంది. దీంతో కారులో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో కారులో ఉన్న వారు అందులో నుంచి బయటపడడానికి వీలు పడలేదు. దీంతో ఐదుగురు కారులోనే సజీవదహనం అయ్యారు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చేసరికి గంట సేపు అయింది. ఈ లోపు ఆ ఐదుగురు కారులోనే కాలి బూడిదయ్యారు. కారు ఆగ్రా నుంచి నోయిడా వైపు వెళ్తోంది. కంటెయినర్ నాగాలాండ్ నుంచి వస్తోందని పోలీసులు చెప్పారు.


ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. ఇంజిన్‌లో సడన్‌గా మంటలు రావడంతో అందులో ఉన్నవారు కొన్నిసార్లు ప్రాణాలతో బయటపడుతున్నారు. మరికొన్ని సార్లు సజీవంగా దహనం అయిపోతున్నారు. అయితే, ఇలా ఇంజిన్లలో మంటలు రావడానికి కారణం ఏంటనే విషయం మాత్రం ఇప్పటి వరకు స్పష్టంగా తెలియరాలేదు.

First published:

Tags: Andhra Pradesh, Visakhapatnam

ఉత్తమ కథలు