Home /News /andhra-pradesh /

CAR ACCIDENT CAR FELL INTO POND THREE PEOPLE DIED IN EAST GODAVARI DISTRICT OF ANDHRA PRADESH NK

Car Accident: ఆంధ్రప్రదేశ్‌లో విషాదం... చెరువులోకి దూసుకెళ్లిన కారు... ముగ్గురి మృతి

ఆంధ్రప్రదేశ్‌లో విషాదం... చెరువులోకి దూసుకెళ్లిన కారు... ముగ్గురి మృతి

ఆంధ్రప్రదేశ్‌లో విషాదం... చెరువులోకి దూసుకెళ్లిన కారు... ముగ్గురి మృతి

Car Accident in Andhra Pradesh: కారు ప్రమాదాల్లో మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటోంది. కారణం... కార్లు చాలా వేగంగా వెళ్లగలవు. ప్రమాదం వచ్చినప్పుడు సడెన్ బ్రేక్ వేసినా... ఆ జోరుకు వెంటనే ఆగవు. ఫలితంగా తీవ్ర విషాద ఘటనలు జరుగుతున్నాయి.

    స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్... అని పోలీసులు హెచ్చరిస్తుంటారు. ఏ వాహనమైనా సరే... వేగంగా వెళ్తుంది కదా అని జోరుగా నడపకూడదు. ఎందుకంటే... వాహనాల జోరుకు తగినట్లుగా మన రాష్ట్రాల్లో రోడ్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక్కో సందర్భంలో... జోరుగా వెళ్లే వాహనాన్ని మనం కంట్రోల్ చెయ్యలేకపోవచ్చు. నిదానమే ప్రదానం అన్నది అక్షర సత్యం. ఒక్కోసారి నిదానంగా వెళ్లినా... చీకటి వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయి. అందుకు ఈ ఘటనే సజీవ సాక్ష్యం. ఆంధ్రప్రదేశ్... తూర్పు గోదావరి జిల్లాలో జరిగిందీ విషాదం. కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిపోవడంతో... ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. యానాంకి చెందిన రిటైర్డ్ టీచర్ ప్రసాదరావు, ఆయన భార్య రిటైర్డ్ టీచర్ విజయలక్ష్మి... కొడుకు సంతోష్‌ చంద్ర ప్రణీత్‌ నిశ్చితార్థం ముగించుకొని గురువారం రాత్రి ఏటిగట్టు రహదారిపై యానాం బయలు దేరారు. కె.గంగవరం మండలం కోటిపల్లి కోట గ్రామం దగ్గరకు రాగానే కారు అదుపు తప్పింది. గోదావరి ఏటి గట్టు రహదారి నుంచి ఒక్కసారిగా అది పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది.

    car accident, east godavari news, ap news, andhra pradesh news, telugu news, telugu varthalu, కారు ప్రమాదం, రోడ్డు ప్రమాదం, తూర్పు గోదావరి జిల్లా వార్తలు, తెలుగు వార్తలు, తెలుగు న్యూస్, ఏపీ న్యూస్, ఏపీ వార్తలు,
    ఆంధ్రప్రదేశ్‌లో విషాదం... చెరువులోకి దూసుకెళ్లిన కారు... ముగ్గురి మృతి


    అంతా చీకటి. ఏం జరుగుతుందో... కారు ఎటు వెళ్లిందో... అందులోని ముగ్గురికీ ఏమీ తెలియలేదు. క్షణాల్లో కారు నీటిలోకి వెళ్లిపోయింది. నిజానికి ఆ సమయంలో చెరువులో కారు మునిగిపోయేంత నీరు లేదు. కానీ... కారు అప్పటికే... అడ్డదిడ్డంగా వెళ్లడంతో... దాని డోర్లు గట్టిగా మూసుకుపోయాయి. లోపలున్న వాళ్లు ఎంత ట్రై చేసినా... డోర్లు తెరచుకోలేదు. వారు ఎంతలా అరిచినా... ఆ అరుపులు ఎవ్వరికీ వినిపించలేదు. అసలే అర్థరాత్రి సమయం. అంతా చీకటి. కారులో ఉన్నవారు... అలాగే విలవిలలాడుతూ... ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు.

    ఇది కూడా చదవండి:Extramarital Affair: వివాహితతో ఆ సంబంధం. భర్తతో కలిసి ప్రియుడిని చంపిన యువతి

    సంతోష్‌ చంద్ర ప్రణీత్‌ బ్యాంకు మేనేజర్‌గా పనిచేస్తున్నారు. శుభకార్యం ముగించుకొని ఇంటికి వెళ్తూ... ఇలా ప్రాణాలు కోల్పోవడంతో... బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పోలీసులు... అసలేం జరిగివుంటుందో... పూర్తిగా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: AP News, Car accident, East Godavari Dist, Road Accident

    తదుపరి వార్తలు