Union
Budget 2023

Highlights

హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Capital: సీఆర్డీఏకి అమరావతి రైతుల షాక్.. ప్లాట్ల రిజిస్ట్రేషన్ కు అభ్యంతరం.. కారణం ఇదే..!

AP Capital: సీఆర్డీఏకి అమరావతి రైతుల షాక్.. ప్లాట్ల రిజిస్ట్రేషన్ కు అభ్యంతరం.. కారణం ఇదే..!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

రాజధాని అమరావతి (AP Capital Amaravati) పై ఇటీవల ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో రైతులకు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసేందుకు సీఆర్డీఏ సిద్ధమైన సంగతి తెలిసిందే.

రాజధాని అమరావతి (AP Capital Amaravati) పై ఇటీవల ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో రైతులకు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసేందుకు సీఆర్డీఏ సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవలే ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవలసిందిగా సీఆర్డీఏ అధికారులు రైతులకు నోటీసులు జారీ చేశారు. ఐతే వ్యవహారంలో రైతులు సీఆర్డీఏకు షాకిచ్చారు. అధికారులిచ్చిన నోటీసులకు రైతులు అభ్యంతరం తెలిపారు. రాజధాని నిర్మాణంలో 2వేల ఎకరాలను భూ సేకరణ కింద తీసుకున్నారని వారికి ఇప్పటివరకు పరిహారం చెల్లించలేదని రైతులంటున్నారు. భూమి ఇచ్చిన వారికి పరిహారం చెల్లించకుండా, ప్లాట్లను ఏమాత్రం అభివృద్ధి చేయకుండా రిజిస్ట్రేషన్ చేస్తామనడాన్ని రైతులు తప్పుబడుతున్నారు. రైతులకు రిజిస్ట్రేషన్ చేస్తామన్న ప్లాట్లు దేవాదాయ శాఖ భూముల్లో కూడా ఉన్నాయని.. ఆ భూముల రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతందని ప్రశ్నిస్తున్నారు.

అంతేకాదు అలాంటి భూములకు రిజిస్ట్రేషన్ పత్రాలు చూపిస్తేనే రిజిస్ట్రేషన్ కు అంగీకరిస్తామని స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు రైతులు సీఆర్డీఏకు లేఖలు రాశారు. తాము వ్యక్తం చేస్తున్న సందేహాలు నివృత్తి చేసిన తర్వాతే రిజిస్ట్రేషన్ కు అంగీకరిస్తామని పేర్కొన్నారు. ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సీఆర్డీఏ చెప్పినా సరే ఎందుకు ఒప్పుకోవడంలేదో రుజువులుండేందుకు రైతులు ఇలా చేసినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో కోర్టు వివాదాలు చోటు చేసుకుంటే మంచిదని వారు భావిస్తున్నట్లు సమాచారం.

ఇది చదవండి: ఏపీ కేబినెట్లో మార్పులకు ముహూర్తం ఫిక్స్..? మంత్రులకు సీఎంఓ సమాచారం..?

గత ప్రభుత్వ హయాంలో సీఆర్డీఏ పరిధిలోని 40వేల మందికి పైగా రైతులకు ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేశారు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత అమరావతి విషయంలో ముందడుగు వేయకపోవడం, మూడు రాజధానుల ప్రకటన చేయడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. ఐతే ఇటీవల రాజధాని నిర్మాణంపైహైకోర్టు తీర్పునిచ్చింది. నెలరోజుల్లో మౌలిక సదుపాయాలు కల్పించి ప్లాట్లను అభివృద్ధి చేసి రైతులకు ఇవ్వాలంటూ ఇందుకు మూడు నెలలు గడవిచ్చింది. ఈ నేపథ్యంలో సీఆర్డీఏ అధికారుల్లో కదలిక వచ్చి ఇంకా ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకోని రైతులు ఈ నెలాఖరుకల్లా రిజిస్ట్రేషన్ చేయుంకోవాలంటూ అధికారులు లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో రైతులు తమ సందేహాలు నివృత్తి చేయాలంటూ సీఆర్డీఏకు లేఖలు రాశారు.

ఇది చదవండి: ఆర్ఆర్ఆర్ బడ్జెట్ తో ఏపీలో ఈ పథకాలు అమలు చేయవచ్చు.. అవేంటంటే..!

ఇక రాజధాని అమరావతి నిర్మాణానికి అప్పటి టీడీపీ ప్రభుత్వం 29 గ్రామాల్లోని 28,587 మంది రైతుల నుంచి 34,385 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో సమీకరించింది. ఇందుకోసం రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు అందజేస్తామని తెలిపింది. ఒప్పందం మేరకు మొత్తం 64,735 ప్లాట్లను రైతులకు కేటాయించింది. ఇందులో 38,282 రెసిడెన్షియల్ ప్లాట్లు, 26,453 కమర్షియల్ ప్లాట్లు సిద్ధం చేసింది. వీటిల్లో 40,378 ప్లాట్లను రైతులకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చింది. ఇంకా 24,357 ప్లాట్లన రిజిస్ట్రేషన్ చేయించాల్సి ఉంది. ఇప్పుడు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసి ప్లాట్లు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నా ప్రభుత్వ తీరుపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సర్కార్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.

First published:

Tags: Amaravati, Andhra Pradesh, Ap capital