హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Budget 2022: బడ్జెట్ ను ఆమోదించిన ఏపీ కేబినెట్.. వీటికే ఎక్కువ కేటాయింపులు..

AP Budget 2022: బడ్జెట్ ను ఆమోదించిన ఏపీ కేబినెట్.. వీటికే ఎక్కువ కేటాయింపులు..

సీఎం జగన్ తో ఆర్ధిక మంత్రి బుగ్గన

సీఎం జగన్ తో ఆర్ధిక మంత్రి బుగ్గన

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కు రంగం సిద్ధమైంది. కాసేపట్లో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే కేబినెట్ సమావేశంలో బడ్జెట్ ను ఆమోదించారు.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) బడ్జెట్ (AP Budget 2022) కు రంగం సిద్ధమైంది. కాసేపట్లో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Buggana Rajendranath Reddy) అసంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో డిప్యూటీ సీఎం బడ్జెట్ పుష్పశ్రీ వాణి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి కన్నబాబు అసెంబ్లీలో ప్రవేశపెట్టనుండగా.. మండలిలో మంత్రి సీదిరి అప్పలరాజు ప్రవేశపెడతారు. ఇప్పటికే రాష్ట్ర బడ్జెట్ ను మంత్రివర్గం ఆమోదించింది. దాదాపు రూ.2 లక్షల 60,000వేల కోట్ల అంచనాలతో బడ్జెట్ ను రూపొందించినట్లు తెలుస్తోంది. వ్యవసాయ, విద్యా వైద్య ఆరోగ్య రంగాలకు బడ్జెట్లో పెద్ద పీట వేసినట్లు సమాచారం. వరసుగా రెండో ఏడాది మహిళా సాధికారకు ప్రాధాన్యమిస్తూ జెండర్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. మహిళలు, పిల్లల కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయింపులు చేయనున్నారు.

అలాగే నవరత్నాల పేరుతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. వైఎస్సార్‌ పెన్షన్ల కానుక కోసమే ఏకంగా రూ.18 వేల కోట్లకు పైగా కేటాయించినట్లు సమాచారం. అలాగే వ్యవసాయం, విద్య, వైద్యం, సంక్షేమం, పేదల ఇళ్లు నిర్మాణాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. వరైతులకు పెద్ద పీట-ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్‌ రూ.40 వేల కోట్లతో రూపొందించినట్లు సమాచారం.

ఇక విద్య, వైద్య రంగాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం నాడు నేడు కింద చేపట్టిన అభివృద్ధి పనులు, కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి కేటాయింపులు చేసినట్లు తెలుస్తోంది. వీటితో పాటు సాగునీటి ప్రాజెక్టులు, రోడ్ల వంటి మౌలిక సదుపాయాలకు నిధులు ఇవ్వనున్నట్లు సమాచారం.


ఈ బడ్జెట్ లో  వసాయం, మహిళా సంక్షేమం, విద్య, వైద్య రంగాలకు అధిక కేటాయింపులు ఉంటాయని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు.  నవరత్నాల పథకాలకు ప్రాధాన్యం ఇచ్చామని.., సీఎం జగన్‌ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా బడ్జెట్‌ రూపొందించినట్లు ఆయన వెల్లడించారు.

First published:

Tags: Andhra Pradesh, AP Budget 2022

ఉత్తమ కథలు