హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Byreddy Siddharth Reddy: సీఎం జగన్ పై ఉన్న అభిమానం ఇది.. బైరెడ్డా మజాకా అంటున్న వైసీపీ ఫ్యాన్స్

Byreddy Siddharth Reddy: సీఎం జగన్ పై ఉన్న అభిమానం ఇది.. బైరెడ్డా మజాకా అంటున్న వైసీపీ ఫ్యాన్స్

బై్రెడ్డి సిద్ధారెడ్డా మజాకా..?

బై్రెడ్డి సిద్ధారెడ్డా మజాకా..?

Byreddy Siddharth Reddy: ప్రస్తుతం ఆంధప్రదేశ్ లో యూత్ ఫాలోయింగ్ ఉన్న సూపర్ లీడర్లలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒకరు. పవర్ ఫుల్ డైలాగులతో ఆయన బాగా ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా సీఎం జగన్ అంటే ఆయనకు ప్రత్యేక అభిమానం. అందుకే ఇలా తన అభిమానాన్ని చూపించి ప్రత్యేకంగా నిలిచారు.

ఇంకా చదవండి ...

  Byreddy Siddhartha Reddy:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి (Byreddy Siddhartha Reddy)కి మంచి క్రేజ్ ఉంది. మాస్ ఫాలోయింగ్ అత్యధికంగా ఉన్న యువ లీడర్లలో ఆయన ముందు వరుసలో ఉంటారు. ముఖ్యంగా తన పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో బాగా ఫేమస్ అయ్యారు. అన్నిటికంటే సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) అంతే ప్రత్యేక అభిమానం ఉన్న నేతగా వైసీపీలో గుర్తింపు పొందారు. అంతేకాదు బైరెడ్డిపై వైసీపీ అధినేత జగన్ కు కూడా అంతే అభిమానం ఉంది. దీంతో శాప్ ( ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ) చైర్మన్ పదవి బాధ్యతలు అప్పచెప్పారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు జిల్లా (Kurnool District) నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ గెలుపునకు బైరెడ్డి కీలక పాత్ర పోషించారు. అందుకే సిద్దార్థ్ రెడ్డి.. తన తమ్ముడి లాంటివాడు అని జగన్ సందర్భం వచ్చిన ప్రతిసారి చెబుతూ వచ్చారు. ఇటీవల మంచి పదవి ఇచ్చి గౌరవించారు. అక్కడి ప్రత్యర్థి వర్గానికి చెక్ పెట్టారు.

  డిసెంబర్ 21న ఏపీ సీఎం జగన్ బర్త్ డే. వైసీపీ నాయకులు, శ్రేణులు ముఖ్యమంత్రి బర్త్ డే వేడుకలు గ్రాండ్‌గా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రిపై తనకున్న అభిమానాన్ని వెరైటీగా చాటుకున్నాడు శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి. విశాఖ (Visakha)లోని రుషికొండలో స్కూబా డైవింగ్ (Scuba Diving) చేసిన బైరెడ్డి, సముద్రం లోతుల్లోకి వెళ్ళి సీఎంకు ముందస్తు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ నెల 21 న ముఖ్యమంత్రి జన్మదినోత్సవం సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasaireddy)నిర్వహిస్తోన్న వైఎస్సార్ కప్ క్రికెట్ -2021 పోటీల సన్నాహాకాల కోసం విశాఖ వచ్చిన సిద్ధార్ధరెడ్డి నగరంలో పలు క్రీడా మైదానాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఇలా జగన్ పై అభిమానాన్ని చాటుకున్నారు.


  2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ గెలుపునకు బైరెడ్డి కీలక పాత్ర పోషించారు. ఆ తరువాత ఎమ్మెల్యే ఆర్థర్‌కు బైరెడ్డికి పడట్లేదని పలుమార్లు వార్తలు పెద్ద ఎత్తునే వచ్చాయి. పేరుకే ఎమ్మెల్యేగా ఆయన గెలిచినా పెత్తనం మాత్రం బైరెడ్డిదే అని వార్తలు కూడా గుప్పుమన్నాయి. అంతేకాదు సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ తన అనుచరులకు టికెట్లు ఇవ్వట్లేదని బైరెడ్డి, ఆర్థర్ ఇద్దరూ కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. అప్పట్లో ఈ ఇద్దరి మధ్య జరిగిన గొడవను కర్నూలు జిల్లా ఇంచార్జ్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సర్ది చెప్పారని కూడా ప్రచారం ఉంది.

  ఇదీ చదవండి: ఏపీలో కొత్త మద్యం రేట్లు ఇవే.. ఆనందంతో మందుబాబుల చిందు.. నిషేధమంటూ తగ్గింపేంటని విపక్షాల ప్రశ్న

  ఆ వివాదం సంగతి ఎలా ఉన్నా.. పాదయాత్ర సమయంలో నందికొట్కూరు ప్రచార సభలో మాట్లాడిన జగన్.. బైరెడ్డి తన మనసులో ఉన్నాడని ఖచ్చితంగా మంచి ప్రాధాన్యత గల పోస్ట్ ఇస్తానని హామీ ఇచ్చారు. అప్పుడు జగన్ ఇచ్చిన హామీని ఇటీవల నామినేటెడ్ పోస్టుల భర్తీలో భాగంగా నెరవేర్చారని బైరెడ్డి అభిమానులు, నియోజకవర్గ కార్యకర్తలు, అనుచరులు చెప్పుకుంటున్నారు. అందుకే జగన్ మోహన్ రెడ్డిపై బైరెట్టికి అభిమానం మరింత రెట్టింపు అయ్యింది. అందరికంటే ముందగానే ఇలా సీఎం కు బర్తేడే శుభాకాంక్షలు తెలిపారు బైరెడ్డి.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, Ap cm ys jagan mohan reddy, AP News, Ysrcp

  ఉత్తమ కథలు