Home /News /andhra-pradesh /

BYJUS JOINED HANDS WITH ANDHRA PRADESH GOVERNMENT TO TEACH STUDENTS IN GOVERNMENT SCHOOLS FULL DETAILS HERE PRN

BYJU's in AP Govt Schools: ఏపీలో బైజూస్ పాఠాలు.. జగన్ సర్కార్ వినూత్న ఆలోచన..

బైజూస్ ప్రతినిథితో సీఎం జగన్

బైజూస్ ప్రతినిథితో సీఎం జగన్

విద్యార్థులకు నాణ్యమైన విద్య దిశగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రపంచంతో పోటీపడేలా పిల్లలను సన్నద్ధంచేసేందుకు రాష్ట్ర విద్యారంగంలో మరో భారీ కార్యక్రమాన్ని చేపట్టేందుకు సీఎం జగన్ సర్కార్ సిద్ధమైంది. ఈ క్రమంలో అతిపెద్ద ఎడ్యుకేషనల్‌ టెక్‌ కంపెనీ ‘బైజూస్‌’ (Byju's) తో ఒప్పందం ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.

ఇంకా చదవండి ...
  విద్యార్థులకు నాణ్యమైన విద్య దిశగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రపంచంతో పోటీపడేలా పిల్లలను సన్నద్ధంచేసేందుకు రాష్ట్ర విద్యారంగంలో మరో భారీ కార్యక్రమాన్ని చేపట్టేందుకు సీఎం జగన్ సర్కార్ సిద్ధమైంది. ఈ క్రమంలో అతిపెద్ద ఎడ్యుకేషనల్‌ టెక్‌ కంపెనీ ‘బైజూస్‌’ (Byju's) తో ఒప్పందం ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. గురువారం సీఎం జగన్ సమక్షంలో ఒప్పందంపై ప్రభుత్వం, బైజూస్‌ ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో ఏడాదికి రూ.20 వేలు నుంచి రూ. 24వేలు పైబడి చెల్లిస్తేకాని లభించని ‘బైజూస్‌’ ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లలో 4 నుంచి 10వ తరగతి వరకూ అందుబాటులోకి రానుంది. తెలుగు, ఇంగ్లిష్ మీడియంలలో సమగ్రంగా నేర్చుకునేందుకు వీలు కల్పించనున్నారు. సీఎం సమక్షంలో కమిషనర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఎస్‌.సురేష్‌కుమార్, బైజూస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మరియు పబ్లిక్‌పాలసీ హెడ్‌ సుస్మిత్‌ సర్కార్‌ సంతకాలు చేశారు. వర్చువల్‌ పద్ధతిలో ‘బైజూస్‌’ వ్యవస్థాపకుడు, సీఈఓ రవీంద్రన్‌ అమెరికా నుంచి పాల్గొన్నారు.

  ఈ సందర్భంగా సీఎం జగనవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2025లో సీబీఎస్‌ఈ నమూనాలో పరీక్షలు రాయనున్న ప్రస్తుత 8వ తరగతి విద్యార్థులను సుశిక్షితులు చేసేందుకు ఇంకొన్ని అడుగులు వేస్తున్నామన్నామని ఆయన అన్నారు. విద్యార్థులకు, సిలబస్‌తోపాటు అదనంగా ఇంగ్లిషు లెర్నింగ్‌ యాప్, నేర్చుకునేందుకు ట్యాబ్‌లు ఇస్తామని తెలిపారు. దాదాపు 4.7లక్షల మందికి ట్యాబ్‌లు ఇచ్చేందుకు రూ.500 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సెప్టెంబరులోనే ట్యాబ్‌లు ఇస్తామని తెలిపారు.

  ఇది చదవండి: కిరణ్ కుమార్ రెడ్డి అందుకే సైలెంట్ అయ్యారా..? ఆ విషయంలో సోనియాకు దండం పెట్టేశారా..?


  ప్రతి ఏటా 8 వరగతిలోకి వచ్చే విద్యార్థులకు ట్యాబ్‌లు ఇస్తామన్న సీఎం.., వచ్చే ఏడాది నుంచి బైజూస్‌ కంటెంట్‌ను పొందుపరిచి పాఠ్యపుస్తకాలను ముద్రిస్తామని తెలిపారు. వీడియోకంటెంట్‌ ద్వారా పిల్లలు నేర్చుకునేందుకు నాడు – నేడు కింద ప్రతి క్లాస్ రూమ్ లోనూ టీవీలు ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో బైజూస్‌ భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందన్న సీఎం.. ఇది పేద పిల్లల జీవితాలను మారుస్తుందని అభిప్రాయపడ్డారు. పదోతరగతిలో ఇంగ్లిష్ మీడియంలో సీబీఎస్‌ఈ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడానికి ఇది దోహదపడుతుందన్నారు. విద్యారంగంలో ఇదొక గేమ్‌ ఛేంజర్‌ అవుతుందన్నారు. దీని ద్వారా డిజిటల్‌ పద్ధతుల్లో నేర్చుకునే విధానం, అభ్యసనం.., అన్నీకూడా పిల్లలకు అందుబాటులోకి వస్తాయన్నారు. టీచర్లకు కూడా మంచి శిక్షణ లభిస్తుందని.., తమ బోధనను మరింత నాణ్యంగా అందించగలుగుతారన్నారు.

  ఇది చదవండి: ఏపీలో మరణాలకు ప్రధాన కారణం ఇదే.. సర్వేలో షాకింగ్ నిజాలు..


  దీనిపై స్పందించిన బైజూస్ సీఈవో రవీంద్రన్.. సీఎం జగన్ ను పొగడ్తలతో ముంచెత్తారు. సీఎం వేగం అనూహ్యమైనదని.. మే 25న ఆయనతో సమావేశమైతే.. ఆయన చాలా వేగంగా స్పదించారన్నారు. ప్రైవేటు స్కూళ్లలో, ఇతరులు అందుబాటులో ఉంటే అదే కంటెంట్‌ను ఎలాంటి వ్యత్యాసం లేకుండా ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థులకూ అందుబాటులోకి తీసుకు వస్తున్నామని ఆయన అన్నారు.

  ఇది చదవండి: ఏపీలో పండే ధాన్యంపై జగన్ కీలక నిర్ణయం.. కొత్త ఉత్పత్తులపై దృష్టి.. వివరాలివే..!


  ప్రస్తుతం ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లలో 4 నుంచి 10వ తరగతి వరకూ విద్యను అభ్యసిస్తున్న పిల్లల సంఖ్య దాదాపుగా 32 లక్షలమంది ఉన్నారు. బైజూస్‌తో ప్రభుత్వం ఒప్పందం కారణంగా వీరందరికీ లెర్నింగ్‌ యాప్‌ద్వారా నాణ్యమైన విద్య అందుతుంది. ఈ లెర్నింగ్ కోసం ప్రభుత్వం ట్యాబ్స్ అందిస్తుండటంతో ప్రభుత్వ పాఠశాలల్లోని 4.7 లక్షల మంది విద్యార్థులు దీనివల్ల లబ్ధి పొందనున్నారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap government, BYJUS

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు