చిత్తూరు జిల్లా, చంద్రగిరి మండల పరిధిలోని తిరుపతి, మదనపల్లె జాతీయ రహదారిలో భాకరాపేట ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కి తీవ్రగాయాలు కాగా, అందులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. మదనపల్లె డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు కర్నాటక రాష్ట్రం, బళ్ళారి నుంచి తిరుపతి వస్తుండగా శనివారం అర్థరాత్రి భాకరాపేట ఘాట్ రోడ్డులోకి రాగానే... బస్సుడ్రైవర్ గంగాధరంకు గుండె పోటు వచ్చింది.... దాంతో ఆయన బస్సును కంట్రోల్ చెయ్యలేకపోయాడు.
అప్పటికే వేగంగా వెళ్తున్న బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ గంగాధరంకు తీవ్ర గాయాలు కాగా అందులోని 20 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం 108 వాహనంలో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: భార్యపై అనుమానం పెంచుకున్న భర్త... సడెన్‌గా ఏం చేశాడంటే...
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సహజంగా ఆర్టీసీ ఉద్యోగులకు హార్ట్ ఎటాక్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఇందుకు చాలా కారణాలు ఉంటున్నాయి. వారు ఎక్కువ టెన్షన్‌తో విధులు నిర్వహిస్తున్నారు. దానికి తోడు... నిద్ర, ఆహారం టైముకి తినేందుకు కుదరదు. ఇలాంటి పరిస్థితుల్లో వారు ఆరోగ్యంపై ఎక్కువ ఫోకస్ పెట్టలేకపోతున్నారు. అందువల్లే వారికి గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తున్నట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Road accident