Accindet: నడిరోడ్డుపై ఘోర ప్రమాదం.., సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు..!

Accindet: నడిరోడ్డుపై ఘోర ప్రమాదం.., సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు..!

Bus hits cars as two injured in Vizianagaram Andhra Pradesh

రోడ్డుపై వెళ్తున్నప్పుడు రెప్పపాటులో ఘోరప్రమాదాలు జరుగుతుంటాయి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా నష్టం తీవ్రంగా ఉంటుంది.

  • Share this:
    రోడ్డుపై వెళ్తున్నప్పుడు రెప్పపాటులో ఘోరప్రమాదాలు జరుగుతుంటాయి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా నష్టం తీవ్రంగా ఉంటుంది. అందుకే రోడ్డు పొడవునా జాగ్రత్తగా వెళ్లండంటూ పోలీసులు బోర్డులు ఏర్పాటు చేస్తుంటారు. అలాగే ట్రాఫిక్ సిగ్నల్ తోనూ హెచ్చరిస్తుంటారు. కానీ కొందరు ఎక్కడైతే జాగ్రత్తగా ఉండాలో అక్కడే అజాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఏమవుతుందిలే అంటూ నిర్లక్ష్యంగా వెళ్తుంటారు. అలాంటి ప్రమాదమే ఇద్దరి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టింది. ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా కేంద్రంలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వేగంగా వచ్చి ఓ కారును ఢీ కొట్టింది. వివరాల్లోకి వెళ్తే విజయనగరం కలక్టరేట్ జంక్షన్లో ఓ కారు సర్కిల్ లో టర్నింగ్ తీసుకుంటుండా కేవీఆర్ ట్రావెల్స్ కు చెందిన హైటెక్ బస్సు వేగంగా వచ్చి కారును ఢీ కొట్టింది.

    సర్కిల్ డివైడర్ కు బస్సుకు మధ్య నలిగి కారు నుజ్జునుజ్జైంది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు డ్రైవర్ ఘటనాస్థలిలోయాకనే బస్సును వదిలి పరారైయ్యాడు. ప్రమాద దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



    ప్రమాదంలో గాయపడ్డవారి వారిని విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉంది. మరోవైపు పోలీసులు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. ప్రమాదంపై ట్రావెల్స్ యాజమాన్యానికి సమాచారమిచ్చారు. జంక్షన్ లో ప్రమాదాన్ని చూసిన వారు భయాందోళనలకు గురయ్యారు. బస్సు డ్రైవర్ ఏమాత్రం జాగ్రత్తగా వ్యవహరించినా ప్రమాదం తప్పేదంటున్నారు.
    Published by:Purna Chandra
    First published: