నదిలో పడిన బస్సు.. చెట్టును ఢీకొన్నకారు.. విశాఖలో రక్తమోడిన రోడ్లు

హైవేపై మరో ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి వంతెన రెయిలింగ్‌ను ఢీకొట్టి.. వారహ నదిలో పడిపోయింది.

news18-telugu
Updated: September 10, 2020, 10:25 AM IST
నదిలో పడిన బస్సు.. చెట్టును ఢీకొన్నకారు.. విశాఖలో రక్తమోడిన రోడ్లు
నదిలో పడిన బస్సు.. చెట్టును ఢీకొన్నకారు.. విశాఖలో రక్తమోడిన రోడ్లు
  • Share this:
విశాఖపట్టణ జిల్లాలో ఇవాళ ఉదయం రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఓ చోట ప్రైవేట్ బస్సు నదిలో పడిపోగా.. మరోచోట కారు చెట్టును ఢీకొట్టింది. విశాఖ నాతవరం-తాండవ కూడలి అగ్రహరం సమీపంలో ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అన్నదమ్ముళ్లు మరణించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అన్నాదమ్ముళ్ల మృతితో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


మరోవైపు విశాఖపట్నం జిల్లా ఎస్‌.రాయవరం మండలం పెనుగొల్లు హైవేపై మరో ప్ర్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి వంతెన రెయిలింగ్‌ను ఢీకొట్టి.. వారహ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. బస్సు చెన్నై నుంచి విశాఖపట్టణం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
Published by: Shiva Kumar Addula
First published: September 10, 2020, 10:20 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading