ఏపీలో రేపటి నుంచి పెరగనున్న బస్ ఛార్జీలు... ఎంతంటే...

ఏపీలో రేపటి నుంచి బస్ ఛార్జీలు పెరగనున్నాయి.

news18-telugu
Updated: December 10, 2019, 4:15 PM IST
ఏపీలో రేపటి నుంచి పెరగనున్న బస్ ఛార్జీలు... ఎంతంటే...
ఒకేసారి 50 వేల మంది ప్రయాణికులు సేవలు పొందేలా వెబ్ సైట్ ఆధునీకరిస్తోంది.
  • Share this:
ఏపీలో పెరిగిన బస్సు ఛార్జీలను రేపటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఇందుకు సంబంధించి ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. పల్లె వెలుగు బస్సుల్లో కిలోమీటర్‌కు 10 పైసలు పెంచాలని నిర్ణయించిన ఏపీఎస్ ఆర్టీసీ... మిగతా సర్వీసుల్లో మాత్రం కిలోమీటర్‌కు 20 పైసలు పెంచాలని నిర్ణయించింది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని కాపాడాలంటే ఛార్జీలు పెంచడం తప్పనిసరి అని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. బస్సు ఛార్జీల పెంపు కారణంగా ప్రజలపై ఏడాదికి రూ. 900 కోట్ల అదనపు భారం పడనుంది. డీజిల్ ధరలు పెరిగినప్పటికీ ఇప్పటివరకు బస్ ఛార్జీలు పెరగలేదని... ఆ భారాన్ని తగ్గించుకునేందుకు ఛార్జీలు పెంచాల్సి వస్తోందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.

రెండు రోజుల క్రితమే దీనిపై నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం... ఛార్జీ పెంపును సాధ్యమైనంత తొందరగా అమలు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే రేపటి నుంచి బస్ ఛార్జీల పెంపును అమలు చేయనున్నారు. తెలంగాణ తరహాలోనే బస్ ఛార్జీల పెంపు విషయంలో నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్... పల్లె వెలుగు బస్సుల విషయంలో మాత్రం కాస్త మినహాయింపు ఇచ్చింది. తెలంగాణలో పల్లె వెలుగు బస్సుల్లోనూ కిలోమీటర్‌పై 20 పైసలు పెంచగా... ఏపీలో మాత్రం పల్లె వెలుగుపై పెంపును కిలోమీటర్‌కు 10 పైసలుగా నిర్ణయించారు.

Published by: Kishore Akkaladevi
First published: December 10, 2019, 4:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading