కడపలో ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ.. పెట్రోల్ ట్యాంక్ పేలి బస్సు దగ్ధం

బైక్‌కు అంటుకున్న మంటలు బస్సుకు కూడా వ్యాపించడంతో డ్రైవర్, కండక్టర్ అప్రమత్తమయ్యారు. బస్సులో ఉన్న ప్రయాణికులందరినీ క్షేమంగా కిందకు దింపారు. అనంతరం బస్సు మంటల్లో పూర్తిగా కాలిపోయింది.


Updated: February 10, 2020, 10:40 PM IST
కడపలో ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ.. పెట్రోల్ ట్యాంక్ పేలి బస్సు దగ్ధం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో అదుపుతప్పిన ఓ బైక్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టి.. అనంతరం బస్సు కిందకు దూసుకెళ్లింది. ప్రమాదంలో స్కూటర్ పెట్రోల్ ట్యాంక్ పేలి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. రైల్వే కోడూరు మండలం శెట్టిగుంట లక్ష్మీగారిపల్లెలో ఈ ప్రమాదం జరిగింది. బైక్‌కు అంటుకున్న మంటలు బస్సుకు కూడా వ్యాపించడంతో డ్రైవర్, కండక్టర్ అప్రమత్తమయ్యారు. బస్సులో ఉన్న ప్రయాణికులందరినీ క్షేమంగా కిందకు దింపారు. అనంతరం బస్సు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. అప్పటికే స్కూటర్ కూడా కాలిబూడిదయింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారులు మరణించాడు. ఐతే బస్సులోని ప్రయాణికులంతా సకాలంలో కిందకు దిగడంతో.. పెను ప్రమాదం తప్పింది.
Published by: Shiva Kumar Addula
First published: February 10, 2020, 10:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading