ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా... ఒకరు మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు

Andhra Pradesh : రోడ్డు ప్రమాదాలకు చెక్ పడటం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నా, అనేక అంశాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి.

news18-telugu
Updated: December 1, 2019, 6:13 AM IST
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా... ఒకరు మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Andhra Pradesh : బెంగళూరు నుంచీ హైదరాబాద్ బయల్దేరిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు... అనంతపురం జిల్లాలోని తపోవనం దగ్గర బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ చనిపోగా... ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 31 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. టోల్ గేట్ దగ్గర ఫాస్ట్ ట్యాగ్ విషయంలో చిన్నపాటి వాదన జరిగిన తర్వాత... డ్రైవర్, క్లీనర్ మధ్య గొడవ జరిగినట్లు తెలిసింది. ఆ తర్వాతే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బోల్తా పడిన బస్సు లైమో లైనర్ ట్రావెల్స్ బస్సుగా గుర్తించారు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు... కేసు రాసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్, క్లీనర్ మధ్య జరిగిన గొడవ వల్ల... డ్రైవర్ సరైన ఏకాగ్రత లేకుండా బండి నడపడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చనే అంచనాలున్నాయి.

 

Pics : చూపులతో షేక్ చేస్తున్న సనా అమిన్ షేక్
ఇవి కూడా చదవండి :హైదరాబాద్‌లో మరో దారుణం... సాప్ట్‌వేర్ ఉద్యోగినిపై రేప్?

నేడు ఆర్టీసీ కార్మికులతో కేసీఆర్ సమావేశం, ఆర్టీసీపై చర్చHealth Tips : పొట్ట తగ్గాలా... చెరుకు రసాన్ని ఇలా తాగితే సరి...

Health Tips : బరువు తగ్గాలా... అల్లంతో ఇలా చెయ్యండి

Health Tips : టీ కంటే డికాక్షన్ బెటర్... మెదడుకు చురుకుదనం
First published: December 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు