Devaragattu Bunni Festival: అడుగడుగునా ఆంక్షలు ఉన్నా.. ఆగని కర్రల సమరం.. దేవరగట్టులో పగిలిన తలలు.. 100 మందికిపైగా గాయాలు

బన్నీ ఉత్సవంలో పగిలిన తలలు

Devaragattu Bunni festival: అడుగడుగునా ఆంక్షలు పెట్టారు. కర్రలు పడితే కటకటాల్లోకి పెడతామంటూ హెచ్చరికలు జారీ చేశారు.. దీంతో కర్రల సమరం జరుగుతుందా అనే అనుమానాలు పెరగాయి. దీంతో క్షణ క్షణం ఉద్విగ్నభరితంగా సాగే కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల సమరం అర్థరాత్రి ప్రారంభమైంది. ప్రతి ఏటా జరిగినట్లే.. ఈ ఏడాది కూడా హింస చోటుచేసుకుంది. 100 మందికి పైగా గాయాలు అయ్యాయి.

  • Share this:
    Devaragattu Bunni festival 2021: కర్నూలు జిల్లా (kurnool District)లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే కర్రల సమరంతో దేవరగట్టు  (Devaragattu) రక్తమోడింది. అడుగడుగునా ఆంక్షలు ఉన్నా ప్రజలు కర్రతలతో కొట్టుకున్నారు. ఈ హింసలో చాలామంది తలలు పగిలాయి.. దాదాపు 100 మందికిపైగా గాయాలు అయ్యాయి. దసరా రోజూ ప్రత్యేకంగా నిలిచే.. ప్రతి ఏటా జరిగినట్లే.. ఈ ఏడాది కూడా హింస చోటుచేసుకుంది. దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి దసరా (Dussehra)బన్ని జైత్రయాత్రలో తాజాగా చెలరేగిన హింసలో సుమారు వంద మందికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. క్షతగాత్రులను ఆదోనిలోని ఆసుపత్రికి తరలించారు. దేవరగట్టు కొండ మీద ఉన్న మాళ మాల్లేశ్వర స్వామి ఆలయంలో స్వామివార్ల కల్యాణం అనంతరం దసరా జైత్రయాత్ర ప్రారంభమైంది. స్వామి వార్ల కల్యాణానికి ముందు నెరిణికి, నెరిణికి తాండ, కొత్తపేట గ్రామస్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొండపై నుంచి ఉత్సవ విగ్రహాలను భక్తులు పల్లకిలో జైత్రయాత్ర కోసం కిందకు తీసుకువచ్చారు. ఏటా మాదిరిగానే ఉత్సవ విగ్రహాల ఊరేగింపులో హింస చెలరేగింది. ఎప్పటిలానే బన్నీ ఉత్సవం (Bunni Utsavam)లో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. అంతకుముందు వరకు అంటే సాయంత్రం వరకు హింసను ఈసారి నిరోధించేందుకు పకడ్బంధీగా చర్యలు తీసుకున్నామని పోలీసులు ప్రకటనలు చేశారు. అప్పటి వరకు ఆంక్షలు కూడా విధించారు. తరువాత చల్లబడిపోయారు. దీంతో ప్రతి ఏడాదిలానే హింస తప్పలేదు. ప్రతి ఏటాలానే వంద మందికిపైగా తలలు పగిలాయి. అయితే.. ఇప్పటికీ.. ఈ ఉత్సవంపై మానవ హక్కుల కమిషన్‌తో పాటు లోకాయుక్త కూడా సీరియస్ అయి కర్నూలు కలెక్టర్ ఎస్పీలకు నోటీసులు జారీ చేశాయి. కళ్ళెదుటే హింస జరుగుతుంటే , పోలీసులు నియంత్రించలేక పోయారు అంటూ నోటీసులో ప్రశ్నలు కురిపించాయి. అయినప్పటికీ దేవరగట్టులో హింస జరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

    దేవరగట్టులో సుమారు 800 అడుగుల ఎత్తైన కొండపై మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని ఉత్సవానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఉత్సవాల సందర్భంగా స్వామి మూర్తులను దక్కించుకోవడానికి నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఓ వైపు, అరికెర, అరికెరతండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం తదితర గ్రామాల భక్తులు మరోవైపు కర్రలతో తలపడ్డారు. క్షణ క్షణం ఉద్విగ్నభరితంగా సాగే కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల సమరం శుక్రవారం అర్థరాత్రి ప్రారంభమైంది. సమరం ప్రారంభమైన కాసేపటికే హింసాత్మకంగా మారింది. దసరా బన్ని జైత్రయాత్రలో తాజాగా చెలరేగిన హింసలో సుమారు వంద మందికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. క్షతగాత్రులను ఆదోనిలోని ఆసుపత్రికి తరలించారు.

    ఇదీ చదవండి: బద్వేల్ బై పోల్ లో జాతీయ పార్టీల పరిస్థితి ఏంటి? ఎవరి లెక్క ఎంత? టీడీపీ-జనసేన ఓట్లు ఎవరికి?

    ఉత్సవాల సందర్భంగా స్వామి మూర్తులను దక్కించుకోవడానికి నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఓ వైపు, అరికెర, అరికెరతండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం తదితర గ్రామాల భక్తులు మరోవైపు కర్రలతో తలపడతారన్న సంగతి తెలిసిందే. అయితే.. హింసను ఈసారి నిరోధించేందుకు పోలీసులు సరైన సమయంలో పకడ్బంధీగా చర్యలు తీసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. దీంతో ప్రతి ఏటాలానే వంద మందికిపైగా తలలు పగిలాయి.
    Published by:Nagesh Paina
    First published: