హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Petrol Price: వాహనదారులకు బంపర్ ఆఫర్.. అక్కడ పెట్రోల్ చాలా ఛీప్.. పోటీ పడి మరి డిస్కౌంట్లు.. మన దగ్గరే..!

Petrol Price: వాహనదారులకు బంపర్ ఆఫర్.. అక్కడ పెట్రోల్ చాలా ఛీప్.. పోటీ పడి మరి డిస్కౌంట్లు.. మన దగ్గరే..!

వాహనదారులకు బంపర్ ఆఫర్

వాహనదారులకు బంపర్ ఆఫర్

Petrol Price: పెట్రోల్ కొట్టించుకోవాలి అనుకునే వారికి.. ఆ రెండు బంక్ లు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. పోటీ పడి పడి మరి డిస్కౌంట్లు ఇస్తున్నాయి.. అక్కడ రెండు రూపాయలు తగ్గిస్తే.. మరో బంక్ లో 2 రూపాయల 40 పైసలు తగ్గిస్తామని ప్రకటనలు ఇస్తున్నాయి. దీంతో అటు వెళ్లే వాహనదారులు భలే మంచి చౌక బేరం అంటూ పెట్రోల్ కొట్టించుకుంటున్నారు.. ఎక్కడో తెలుసా?

ఇంకా చదవండి ...

Petrol Price: వాహనం ఏదైనా బయటకు తీయాలంటే భయం వేస్తోంది. ఎందుకంటే పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel) రేట్లు ఇప్పటికే ఆకాశాన్ని అంటాయి. దేశ వ్యాప్తంగా అన్ని చోట్ల ఎప్పుడో సెంచరీ మార్క్ ను క్రాస్ చేశాయి.. పెరిగిన పెట్రోల్ ఛార్జీలతో (Petrol Rates Hikes).. పర్సులు ఖాళీ అవుతున్నాయి.. బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గుతోంది.. కానీ మైలేజ్ రావడం లేదు.. ఒకప్పుడు 15 రోజులకు ఒకసారి పెట్రోల్ కొట్టించుకుంటే.. ఇప్పుడు వారానికి రెండు మూడు సార్లు పెట్రోల్ కొట్టించుకునే పరిస్థితి ఏర్పడింది.. నిత్యం పెరుగుతున్న ఈ ఇంధన ధరలపై దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. అయినా నేల చూపులు చూడడం లేదు. పరిస్థితి మరీ చేయజారి పోవడంతో.. తాజాగా కేంద్రం (Central Government) కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం శనివారం అంటే మే 21న పెట్రోల్‌పై లీటరుకు 8 రూపాయలు, డీజిల్‌పై 6 రూపాయల చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) ప్రకటించారు. ఈ సుంకాన్ని తగ్గించడం ద్వారా వాహనదారులకు భారీ ఊరట లభించింది. దీంతో లీటరు పెట్రోల్‌పై 9 రూపాయల 5 పైసలు, డీజిల్‌పై 7 రూపాయలు తగ్గుతుందని ఆమె తెలిపారు. అయితే పెట్రోల్‌ ప్రైస్‌ తగ్గడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు వినియోగదారులు. కేంద్రం తీసుకున్న పెట్రో రేట్ల తగ్గింపు నిర్ణయం దేశమంతా ఒకలా ఉంటే. మన రాష్ట్రంలో మాత్రం ఓ జిల్లాలో వినియోగ దారులకు బంకులు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.

కడప జిల్లా(Kadapa District)లో రెండు బంకుల మధ్య పోటీ.. వాహనదారులకు ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. ఆయా బంక్లు తమ బిజినెస్‌ పెంచుకునేందుకు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాయి. వాహనదారులను ఆకట్టుకునేందుకు పెట్రోల్ ఊహించని పై డిస్కౌంట్లు ఇస్తున్నాయి. పోటీని బట్టి ఈ రేట్లను మార్చేస్తున్నాయి. రండి బాబూ రండి.. మా దగ్గర పెట్రోల్‌ డెడ్‌ చీప్‌ అంటున్నాయి. ఆ బంక్‌ 2 రూపాయలు తగ్గిస్తే.. మా దగ్గర రెండు రూపాయల 40 పైసలు తగ్గిస్తాం అంటూ ప్రకటిస్తున్నాయి.


ఈ ఆఫర్లు ఎక్కడ అనుకుంటున్నారా..? కడప-రాజంపేట (Rajampet) మార్గంలో ఉన్న రెండు పెట్రోల్‌ బంకులు.. ఇలా పోటీ పడి మరీ ఇందనం రేట్లను తగ్గిస్తున్నాయి. పక్కనున్న బంక్‌ 2 రూపాయాలు తగ్గిస్తున్నట్టు బోర్డ్‌ పెట్టింది. అంతే ఆ బంక్‌ 2 రూపాయలు తగ్గిస్తే మేం ఏకంగా 2 రూపాయల 40 పైసలు తగ్గిస్తామంటూ స్పెషల్ డిస్కౌంట్‌ అనౌన్స్‌ చేస్తున్నాయి. దానికి సంబంధించి బోర్డులు కూడా అక్కడ ఏర్పాటు చేశాయి. ఇదీ చదవండి : బైక్ పై ఫ్యామిలీతో బయటకు వెళ్తున్నారా? బీకేర్ ఫుల్.. ఈ సీన్ చూస్తే అమ్మో అనాల్సిందే?

ఇలా రాష్ట్ర వ్యాప్తంగా బంక్ లు పోటీ పడి.. రేట్లు తగ్గిస్తే.. వాహనదారులు అంతా పండగ చేసుకుంటారు కదా.. చూద్దా ఈ స్ఫూర్తితో.. అన్ని బంక్ లు రేట్లను తగ్గించాలి అని కోరుకుందాం.. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వాహనదారులు అందరికి పండుగే.. ఏది ఏమైనా.. ప్రస్తుతం ఆ రెండు బంకుల మధ్య పోటీ.. హాట్ టాపిక్ గా మారింది..

First published:

Tags: Andhra Pradesh, AP News, Kadapa, Petrol Price, Petrol rate

ఉత్తమ కథలు