మూడు అడుగుల వెడల్పున్న గొయ్యిలో ఇరుక్కుపోయి.. మూడు రోజులుగా ఆ గేదెకు నరకయాతన.. అన్నం, నీళ్లు లేక..

గొయ్యిలో ఇరుక్కుపోయిన గేదె

అన్నం లేకపోయినా ఉండగలం కానీ, గంటకు ఓసారి నీళ్లు తాగకపోతే మాత్రం అస్సలు ఉండలేం. కదలకుండా ఒకే చోట ఉండాలంటే మాత్రం ఇక ప్రత్యక్ష నరకాన్ని అనుభవించినట్లు ఫీలవుతాం. కానీ ఓ గేదె మాత్రం..

 • Share this:
  ఒక్క రోజు అన్నం తినకపోతోనే ఆకలితో అలమటించి పోతుంటాం. ఇక నీళ్లు కూడా తాగకపోతే అల్లాడిపోతాం. అన్నం నీళ్లు లేకుండా 24 గంటల పాటు ఉండాలంటే పై ప్రాణాలు పైనే పోతాయి. అన్నం లేకపోయినా ఉండగలం కానీ, గంటకు ఓసారి నీళ్లు తాగకపోతే మాత్రం అస్సలు ఉండలేం. కదలకుండా ఒకే చోట ఉండాలంటే మాత్రం ఇక ప్రత్యక్ష నరకాన్ని అనుభవించినట్లు ఫీలవుతాం. అలాంటిది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు రోజుల పాటు ఆహారం లేదు. నీళ్లు కూడా తాగలేని పరిస్థితి. అడుగు తీసి అడుగేయాలన్నీ కుదరని స్థితి. ఓ వైపు నరకంలాంటి ప్రాంతం. అంతటి ఇబ్బందికర పరిస్థితుల్లో మనిషి అన్నవాడు అయితే మాత్రం బతకడు. కానీ ఓ గేదె మాత్రం ప్రాణాలు దక్కించుకుంది. పొరపాటున ప్రమాదంలో పడి మూడు రోజుల పాటు నరకం చవిచూసి అదృష్టవశాత్తు బయటపడింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

  పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడు మండలం అజ్జమూరుగరువులో బుంగా ప్రభుదాస్ అనే వ్యక్తికి గేదెలు ఉన్నాయి. వ్యవసాయం చేసుకుంటూ గేదెలను సాకుతూ జీవనాన్ని సాగిస్తున్నాడు. అయితే మంగళవారం నుంచి అతడికి సంబంధించిన ఓ గేదె కనిపించకుండా పోయింది. గేదె కోసం పొలాలన్నీ వెతికాడు. ఎక్కడకు వెళ్లిందో, ఎవరైనా తీసుకెళ్లిపోయారేమోనని కంగారు పడ్డాడు. ఊరంతా వెతికినా కనిపించలేదు. తనంతట తానే తిరిగొస్తుందని ఆశించాడు కూడా. ఆ గేదె తిరిగి రాకపోవడం సరికదా దాని ఆచూకీ కూడా లభ్యమవలేదు. శుక్రవారం మధ్యాహ్నం ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన చిన్న పాటి నూతిలో ఈ గేదె పడిపోయిన స్థితిలో కనిపించింది.
  ఇది కూడా చదవండి: భర్త దారుణ హత్య.. పర్సు తీసుకొస్తానని పోలీసులకు చెప్పి ఇంట్లోకి వెళ్లిన భార్య.. ఎంతకూ తిరిగి రాకపోవడంతో వెళ్లి చూస్తే..

  పది అడుగుల లోతు, మూడు అడుగుల వెడల్పు మాత్రమే కలిగి ఉన్న ఈ నూతిలో గేదె పడిపోయింది. దాంట్లో ఇరుక్కుపోయి పైకి రాలేక, ఎటూ కదల్లేక అలాగే ఉండిపోయింది. మూడు రోజులుగా దాన్ని ఎవరూ గుర్తించకపోవడంతో నరక యాతన అనుభవించింది. చివరకు యజమాని దాన్ని చూడటంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సిబ్బంది జేసీబీ సాయంతో దానికి సమాంతరంగా గొయ్యిని తవ్వి ఆ గేదెను సురక్షితంగా బయటకు తీశారు. ఆ గేదె బతికి బట్టకట్టడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మూడు రోజులుగా ఆ గేదెకు ఆహారం లేకపోవడంతో నీరసించిపోయింది. దీంతో వెటర్నరీ డాక్టర్ ఆ గేదెకు ఫ్లూయిడ్స్ ఇచ్చి ప్రాధమిక చికిత్స నిర్వహించారు.
  ఇది కూడా చదవండి: ప్రియుడితో తల్లి ఎస్కేప్.. తండ్రి బాధను చూడలేక.. పదేళ్ల తర్వాత కన్న కొడుకే పనోడిలా చేరి ఇలా పగతీర్చుకున్నాడు..!
  Published by:Hasaan Kandula
  First published: