PUBG : పబ్జీకి బానిసై ప్రాణం తీసుకున్న బీటెక్ విద్యార్థి

పబ్జీ గేమ్ బానిసైన బీటెక్ విద్యార్థి.. ఇంటిపైన నిర్మాణంలో ఉన్న గదిలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

news18-telugu
Updated: September 12, 2020, 9:51 AM IST
PUBG : పబ్జీకి బానిసై ప్రాణం తీసుకున్న బీటెక్ విద్యార్థి
pubg (ప్రతీకాత్మక చిత్రం )
  • Share this:
అనంతపురం : పట్టణంలోని రెవెన్యూ కాలనీలో అదృశ్యమైన బీటెక్ విద్యార్థి శవమై తేలాడు. పబ్జీ గేమ్ బానిసైన ఆ యువకుడు.. ఇంటిపైన నిర్మాణంలో ఉన్న గదిలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. రెవెన్యూ కాలనీకి చెందిన కిరణ్‌కుమార్ రెడ్డి చెన్నైలో బీటేక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కళాశాలలో చదువుతున్న సమయంలో పబ్బీ గేమ్‌కు బానిస అయ్యాడు. లాక్‌డౌన్ సమయంలో ఇంటికి వచ్చిన కిరణ్.. అధిక సమయం ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతూనే ఉన్నాడు. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం పబ్జీపై నిషేధం విధించడంతో కిరణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఈ నెల 7న వారి ఇంటిపైన నిర్మాణంలో ఉన్న ఓ గదిలోకి వెళ్లి ఊరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అయితే అప్పటి నుంచి కిరణ్ కనిపించకపోవడంతో.. అతని తల్లిదండ్రలు నరసింహారెడ్డి, హిమాజ రాణి పలు చోట్ల గాలించారు. అయిన లాభం లేకపోవడంతో.. తమ కుమారుడు కనిపించడం లేదని త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక, శుక్రవారం ఇంటిపై నిర్మాణంలో ఉన్న గది నుంచి దుర్వాసన వస్తుండటంతో కూలీలు.. ఆ గది తలుపులు పగలగొట్టి చూశారు. అక్కడ కిరణ్ ఊరికి వేలాడుతూ కనిపించాడు. కుమారుడి అలా చూసిన తల్లిదండ్రలు బోరున విలపించారు.  ఈ ఘటనకు సంబంధించి త్రీటౌన్ పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకున్నారు.
Published by: Sumanth Kanukuka
First published: September 12, 2020, 9:51 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading