BSF FORCES FOUND LAND MINES IN ANDHRA ODISHA BORDER AS MAOISTS TEAMS GETTING ACTIVE HERE ARE THE DETAILS PRN
Andhra-Odisha Boarder: ఆంధ్రా-ఒడిశా బోర్డర్ లో టెన్షన్ టెన్షన్... లైవ్ లో బాంబ్ బ్లాస్ట్
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో బాంబుల కలకలం
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో Andhra-Odisha Border) టెన్షన్ వాతావరణం నెలకొంది. గిరిజన పల్లెల సాక్షిగా పోలీసులు (Police)- మావోయిస్టులకు (Maoists) మధ్య యుద్ధం సాగుతోంది.
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. గిరిజన పల్లెల సాక్షిగా పోలీసులు- మావోయిస్టులకు మధ్య యుద్ధం సాగుతోంది. తరచూ ఏఓబీ సరిహద్దుల్లో కాల్పుల మోతతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా ఇదే ప్రాంతంలో మరోసారి బాంబుల కలకలం రేగింది. ఏఓబీ పరిధిలోని చిత్రకొండ స్వాబిమాన్ అటవీ ప్రాంతంలోని హంటల్‌గుడలో బిఎస్ఎఫ్ బలగాలు మావోయిస్టులకి చెందిన పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిఘా వర్గాల సమాచారం ప్రకారం బీఎస్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు నిర్వహించారు. చిత్రకొండ బ్లాక్ హంటల్ గూడ అటవీ ప్రాంతంలోని కదలిబంధ గ్రామానికి సమీపంలో ఉన్న కొండ వద్ద మావోయిస్టులు దాచి ఉంచిన బ్యాగ్ ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బ్యాగ్ నుండి రెండు ప్రెషర్ మైన్స్, ఒక టిఫిన్ బాంబు మరియు ఇతర వస్తువులను బిఎస్ఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వెంటనే జవాన్లు పై అధికారులకు సమాచారమివ్వగా.. ఘటనాస్థలికి చేరుకున్న బాంబ్ స్క్వాడ్.. వాటిని పేల్చేసింది. కొన్ని రోజులుగా, స్వాబిమాన్ ప్రాంతంలోని బిఎస్ఎఫ్ పోలీసులు మావోయిస్టు ప్రణాళికను వివిధ సమయాల్లో అడ్డుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఘటనల దృష్ట్యా పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేయగా.. పేలుడు పదార్ధాలు లభ్యమయ్యాయి. ఐతే ఇవి కూంబింగ్ జరుపుతున్న పోలీసులను టార్గెట్ చేసి పెట్టారా లేక.. కొండరాళ్ల మధ్యలో దాచుకున్నారా అనే దానిపై స్పష్టత లేదు.
ఇటీవల ఇదే ప్రాంతంలో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఏజెన్సీ ప్రాంతంలో కూంబిం నిర్వహిస్తున్న భద్రతాబలగాలే లక్ష్యంగా చేసుకున్న మావోయిస్టులు..ఓ ల్యాండ్ మైన్ తో ఎటాక్ చేశారు. ఈ ఘటనలో బీఎస్ఎఫ్ జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. భద్రతా సిబ్బంది వెంటనే జవాన్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఒడిశా పరిధిలోని మల్కాన్‌గిరి జిల్లా దాల్‌దాలీ అటవీ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. ల్యాండ్ మైన్ పేల్చినప్పటి నుంచి పోలీసులు అప్రమత్తయ్యారు. కూంబింగ్ బృందాల సంఖ్య పెంచి ఏజెన్సీని జల్లెడపడుతున్నారు.