హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

BRS-AP: బీఆర్ఎస్ బిగ్ ప్లాన్.. ఏపీలోని ఆ ఇద్దరు నేతలతో చర్చలు. ?

BRS-AP: బీఆర్ఎస్ బిగ్ ప్లాన్.. ఏపీలోని ఆ ఇద్దరు నేతలతో చర్చలు. ?

సీఎం కేసీఆర్ (పాత ఫోటో)

సీఎం కేసీఆర్ (పాత ఫోటో)

AP Politics: త్వరలోనే మహారాష్ట్రలోని నాందెడ్‌లో సభను ఏర్పాటు చేస్తున్న బీఆర్ఎస్.. ఏపీలోని విశాఖలోనూ భారీ సభను పెట్టాలని భావిస్తోంది. ఈ సభ ద్వారా ఏపీలో బలోపేతం కావాలని కేసీఆర్ యోచిస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన తరువాత పార్టీని ఇతర రాష్ట్రాల్లోనూ విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్న పార్టీ అధినేత కేసీఆర్(KCR).. ఇందుకోసం నేతలను తనవైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. ఇప్పటికే ఏపీకి చెందిన తోట చంద్రశేఖర్ సహా పలువురు నేతలు బీఆర్ఎస్‌లో చేరారు. తోట చంద్రశేఖర్‌ను ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమించిన కేసీఆర్.. మరికొందరు నేతలను కూడా బీఆర్ఎస్‌లో తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద ఏపీకి చెందిన మాజీమంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao), సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను(Lakshmi Narayana) కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఓ కార్యక్రమం కోసం విశాఖ వెళ్లిన వివేకానంద.. ఈ ఇద్దరు నేతలను కలిశారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఈ ఇద్దరు నేతలను తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుందేమో చర్చలు జోరందుకున్నాయి.

అయితే ఏపీ రాజకీయాల్లో రాణిస్తున్న గంటా శ్రీనివాసరావు ఇందుకు సుముఖత వ్యక్తం చేస్తారా ? అన్నది సందేహమే అని చాలామంది భావిస్తున్నారు. టీడీపీలో కొనసాగాలని భావిస్తున్న గంటా శ్రీనివాసరావు.. అవకాశాన్ని బట్టి ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలో చేరే ఛాన్స్ ఉంటుందని పలువురు చర్చించుకుంటున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. వచ్చే ఎన్నికల్లోనూ విశాఖ నుంచి లోక్ సభకు పోటీ చేయాలని డిసైడయ్యారు.

అయితే ఏ పార్టీ నుంచి బరిలోకి దిగాలనే విషయంలో మాత్రం ఇంకా ఆయన నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఆయనను తమ పార్టీలోకి తీసుకుని విశాఖ నుంచే పోటీ చేయించాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని సమాచారం. గతంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లక్ష్మీనారాయణకు ఫోన్ చేసి ఈ అంశంపై మాట్లాడినా.. ఆయన బీఆర్ఎస్‌లో చేరే అంశంపై హామీ ఇవ్వలేదని వార్తలు వచ్చాయి. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానందను కలిసిన లక్ష్మీనారాయణ.. ఈ అంశానికి సంబంధించి ఏం చెప్పారన్నది ఆసక్తికరంగా మారింది.

Revanth Reddy: మారిన రేవంత్ పాదయాత్ర వేదిక.. కొత్త వేదిక ఇదే..!

BIG BREAKING: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో సంచలనం..ఈడీ ఛార్జ్ షీట్ లో ఢిల్లీ సీఎం, వైసీపీ ఎంపీ పేర్లు

త్వరలోనే మహారాష్ట్రలోని నాందెడ్‌లో సభను ఏర్పాటు చేస్తున్న బీఆర్ఎస్.. ఏపీలోని విశాఖలోనూ భారీ సభను పెట్టాలని భావిస్తోంది. ఈ సభ ద్వారా ఏపీలో బలోపేతం కావాలని కేసీఆర్ యోచిస్తున్నారు. గంటా, లక్ష్మీనారాయణ వంటి నేతలు బీఆర్ఎస్‌లోకి వస్తే.. ఆ తరువాత మరింత మంది నాయకులను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఛాన్స్ ఉంటుందని ఆ పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. మరి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కలిసి ఆ ఇద్దరు నేతలు.. ఈ విషయంలో ఆయనకు ఏం చెప్పారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.

First published:

Tags: Andhra Pradesh, BRS, Telangana