ఏపీలో జగన్ ప్రభుత్వంపై బ్రిటిష్‌ హైకమిషనర్‌ ప్రశంసలు..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ నియంత్రణకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను బ్రిటన్ తాత్కాలిక హైకమిషనర్ జాన్‌ థాంప్సన్‌ ప్రశంసించారు.

news18-telugu
Updated: August 7, 2020, 6:33 PM IST
ఏపీలో జగన్ ప్రభుత్వంపై బ్రిటిష్‌ హైకమిషనర్‌ ప్రశంసలు..
బ్రిటిష్ తాత్కాలిక హైకమిషనర్ జాన్ థాంప్సన్‌తో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ నియంత్రణకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను బ్రిటన్ తాత్కాలిక హైకమిషనర్ జాన్‌ థాంప్సన్‌ ప్రశంసించారు. భారీగా టెస్టులు చేయడంలో, పాజిటివ్‌ కేసులను గుర్తించండంలో ఆంధ్రప్రదేశ్‌ విశేషంగా పనిచేస్తోందన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ తో ఆమె వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అలాగే కోవిడ్‌ వల్ల మరణాలు రేటు పూర్తిగా అదుపులో ఉండడం ప్రశంసనీయమన్నారు. టెలీమెడిసిన్‌ లాంటి కొత్త విధానాలు ముందుకు తీసుకెళ్తున్నారని అభినందించారు. వైద్య, విద్య, ఆరోగ్య రంగాల్లో ఏపీ ప్రభుత్వం మంచి చర్యలను తీసుకుంటోందని ప్రశంసించారు. ‘ఏపీ మెడ్‌ టెక్‌జోన్‌తో ఇటీవలే అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. కోవిడ్‌ నివారణకోసం వాడే వైద్య పరికరాల తయారీకి ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. ఈ విషయంలో స్టార్టప్‌ కంపెనీలను యూకే ప్రోత్సహిస్తుంది. కరోనా విపత్తును ఎదుర్కోనే ప్రక్రియలో కలిసి ముందుకు సాగడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇంగ్లండ్‌కు చెందిన నేషనల్‌ హెల్త్‌మిషన్‌ భాగస్వామం 108, 104 లాంటి అంబులెన్స్‌ల నిర్వహణలో ఉత్తమ పద్ధతులు, టెక్నాలజీలకు దారితీస్తుంది.’ అని అన్నారు. కోవిడ్‌ పరిస్థితులు సద్దుమణిగాక బ్రిటన్‌ రావాల్సిందిగా సీఎం జగన్‌ను బ్రిటిష్‌ హైకమిషనర్‌ ఆహ్వానించారు.

ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఎత్తున కరోనా టెస్టులు చేస్తున్నట్టు సీఎం జగన్ చెప్పారు. సగటున రోజుకు 62వేల వరకూ పరీక్షలు చేస్తున్నామన్నారు. కోవిడ్‌సోకిన వారిని వేగంగా గుర్తించి.. వారిని ఐసోలేట్‌చేయడానికి, వైద్యం అదించండానికి తద్వారా మరణాలు రేటు తగించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. మరణాలు రేటు దేశం సగటుతో పోలిస్తే చాలా తక్కువని జగన్ చెప్పారు. తాము అధికారంలోకి రాకముందు ప్రభుత్వ ఆరోగ్య రంగంలో వైద్య సదుపాయాలు అంతంత మాత్రమే ఉండేవని, ప్రస్తుతం ప్రజారోగ్య రంగంపై బాగా దృష్టిపెట్టినట్టు చెప్పారు. నాడు–నేడు ద్వారా ఆస్పత్రులను అభివృద్ధిచేస్తున్నామన్నారు. 16 కొత్త మెడికల్‌ కాలేజీలను కాలేజీలు, ఆస్పత్రులు తీసుకువస్తున్నామన్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 7, 2020, 6:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading