హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: అమ్మాయిల కాలేజీలో అబ్బాయిలకు అడ్మిషన్... ఎక్కడో తెలుసా..?

Andhra Pradesh: అమ్మాయిల కాలేజీలో అబ్బాయిలకు అడ్మిషన్... ఎక్కడో తెలుసా..?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Anantapur: అది గర్ల్స్ కాలేజీ. అక్కడ అమ్మాయిలకు మాత్రమే అడ్మిషన్ ఇవ్వాలి. కాలేజీ గేటులోపలికి అబ్బాయిలకు పర్మిషన్ ఉండదు. మహిళా డిగ్రీ కాలేజీలో అబ్బాయిలకు అడ్మిషన్స్ ఇచ్చేశారు అధికారులు.

  అది గర్ల్స్ కాలేజీ. అక్కడ అమ్మాయిలకు మాత్రమే అడ్మిషన్ ఇవ్వాలి. కాలేజీ గేటులోపలికి అబ్బాయిలకు పర్మిషన్ ఉండదు. మహిళా డిగ్రీ కాలేజీలో అబ్బాయిలకు అడ్మిషన్స్ ఇచ్చేశారు అధికారులు. దీంతో గందరగోళం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం సమీపంలోని అలమూరు రోడ్డులో మహిళా డిగ్రీ కళాశాల ఉంది. ఆన్ లైన్ అడ్మిషన్ ప్రక్రియలో భాగంగా పురుషులకు కూడా ఇక్కడ అడ్మిషన్స్ ఇచ్చేశారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పదుల సంఖ్యలో అబ్బాయిలు ఈ కాలేజీని సెలెక్ట్ చేసుకున్నారు. ఇందుకు కారణం అధికాలు నిర్లక్ష్యం. డిగ్లీ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం ప్రభుత్వం ఆన్ లైన్ విధానాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని కాలేజీలను ఆన్ లైన్ పోర్టల్లో ఉంచి విద్యార్థులకు ఆప్షన్ ఇస్తోంది.

  ఈ క్రమంలో మహిళా కాలేజీని కో-ఎడ్యుకేషన్ కళాశాలగా అధికారులు ఎంటర్ చేశారు. దీంతో విద్యార్థులు తమకు దగ్గరగా ఉంటుందనే భావనతో చాలా మంది విద్యార్థులు ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు. ఆన్ లైన్ అడ్మిషన్స్ కావడంతో సీటు కూడా ఖరారైంది. తీరా అధికారుల నిర్లక్ష్యంతో తప్పుగా నమోదైందని తెలిసి విద్యార్థులు తల పట్టుకుంటున్నారు. ఈ వ్యవహారంలో కాలేజీ యాజమాన్యం పొరబాటు ఉన్నట్లు తేలింది. కాలేజీ వివరాలను ఆన్ లైన్ అడ్మిషన్స్ పోర్టల్ లో ఎంటర్ చేసే సమయంలో మహిళా కాలేజీకి బదులుగా కో-ఎడ్యుకేషన్ అని ఎంటర్ చేయడంతోనే ఈ చిక్కొచ్చి పడినట్లు అధికారులు చెప్తున్నారు.

  ఇది చదవండి: ఏపీలో ఆ మాంసానికి ఫుల్ డిమాండ్... మగతనం కోసమేనట..  ఈ వ్యవహారంలో తప్పు ఎవరు చేసినా.. నష్టపోతున్నది మాత్రం విద్యార్థులే. ఎందుకంటే ఆన్ లైన్లో అడ్మిషన్ పొందిన వారు బుదవారం(ఫిబ్రవరి 24) లోపు కాలేజీలో రిపోర్ట్ చేయాలి. మహిళా కాలేజీ కావడంతో అబ్బాయిలు రిపోర్ట్ చేయలేరు. ఈ లెక్కన స్పాట్ అడ్మిషన్స్ తీసుకోవాలి. కాని ఇక్కడ ఇంకో చిక్కుఉంది. స్పాట్ అడ్మిషన్ తీసుకుంటే జగన్న విద్యాదీవెన (RTF) పథకం వర్తించదు. దీంతో అలాంటి విద్యార్థులపై ఏడాదికి రూ.14వేల నుంచి 20వేల వరకు అదనపు భారం పడుతుంది. దీనిపై స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారులు ఉన్నతాధికారులతో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

  మరోవైపు అధికారుల నిర్లక్ష్యంపై విద్యార్థులు మండిపడుతున్నారు. అడ్మిషన్స్ పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడమేంటని ప్రశ్నిస్తున్నారు. అనంతపురం జిల్లాలో 90 డిగ్రీ కాలేజీలుండగా.. 38వేల మందికి పైగా విద్యార్థులున్నారు. వీరిలో కొంతమందికి ఇంతవరకు అడ్మిషన్స్ ఖరారవలేదు. ఇప్పటికి రెండు విడతల్లో కౌన్సెలింగ్ జరగ్గా.. మూడో విడతపై క్లారిటీ లేదు. దీంతో సీట్లు రాని విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Anantapuram, Andhra Pradesh, Andhra pradesh news, AP News, Students\, Telugu news

  ఉత్తమ కథలు