లాక్‌డౌన్ వేళ మద్యం మత్తు.. మంచిర్యాలలో భారీగా పట్టివేత

మంచిర్యాలలో పట్టుకున్న మద్యం

మంచిర్యాల జిల్లాలో సీసీసీ నస్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ప్రశాంత్ నగర్‌లో భారీగా మద్యం బాటిళ్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  • Share this:
    లాక్‌డౌన్ అమల్లోకి వచ్చి సరిగ్గా 37 రోజులు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ దృష్ట్యా తీసుకున్న లాక్‌డౌన్ వల్ల మందుబాబులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. లాక్‌డౌన్ మొదటి 20 రోజుల వరకు మద్యం అమ్మకాలేం పెద్దగా జరగలేదు. కానీ లాక్‌డౌన్‌ను రెండోసారి పొడగించినప్పటి నుంచి అక్రమ మద్యం అమ్మకాలకు తేరలేపారు. ప్రభుత్వమూ.. అధికారులూ మద్యం దుకాణాలు, బార్లకు సీల్ వేసినప్పటికీ అవేం అక్రమార్కులను ఆపడం లేదు. మద్యం దుకాణానికి వేసిన సీల్ వేసినట్టే ఉంటుంది. కానీ దుకాణం లోపలి మద్యం మాత్రం మాయమవుతోంది. లాక్‌డౌన్ నిబంధనల్లో భాగంగా చేపడుతన్న వాహన తనిఖీల్లో భారీగా మద్యం పట్టుబడుతోంది. కొన్ని ప్రాంతాల్లో పోలీసులు దాడులు చేసి భారీ స్థాయిలోనే మద్యాన్ని పట్టుకుంటున్నారు. నిత్యం పదుల సంఖ్యలో ఇలాంటి అక్రమ మద్యం ఘటనలు బయటపడుతున్న అక్రమార్కులు మాత్రం ఆ దందాను ఆపడం లేదు.

    తాజాగా మంచిర్యాల జిల్లాలో సీసీసీ నస్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ప్రశాంత్ నగర్‌లో భారీగా మద్యం బాటిళ్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రశాంత్ నగర్‌లో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయన్న విశ్వసనీయం సమాచారం మేరకు పోలీసులు ఓ ఇంటిపై దాడి చేశారు. దాడిలో భారీగా మద్యం బాటిళ్లు బయటపడ్డాయి. నిందితులు, మద్యంబాటిళ్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు నస్పూర్ పోలీసులకు అప్పగించారు.
    Published by:Narsimha Badhini
    First published: