జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. ఇటీవల పవన్ జగనన్న ఇళ్లపై చేసిన విమర్శలకు బొత్స కౌంటర్ ఇచ్చారు. సినిమా నటుడు అని జనాలు చూడడానికి వస్తే వాళ్ల ముందు ఆవేశంగా మాట్లాడితే సరిపోతుందా అని ప్రశ్నించారు. నీ మీద ప్రధానికి ఫిర్యాదు చేయడానికి నీవేమైనా పుడింగివా అంటూ పవన్ (Pawan Kalyan) పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నువ్వు చెప్పేదంతా నమ్మడానికి నీవేమైనా యుగ పురుషుడివా అని ఆయన ఎద్దేవా చేశారు.
తేల్చేస్తా..తేల్చేస్తా అంటున్నవ్ కదా ఏం తేలుస్తావని పవన్ (Pawan Kalyan) ను ఆయన ప్రశ్నించారు. పేదలందరికీ ఇళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో వైఎస్సార్ నడిచారని, ఇప్పుడు అదే లక్ష్యంతో సీఎం జగన్ పని చేస్తున్నారని అన్నారు. పేదలకు ఇళ్లు ఇవ్వాలనుకోవడం తప్పా అని ఆయన ప్రశ్నించారు. ప్రజలను మభ్య పెట్టేందుకే పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారని మంత్రి విమర్శలు గుప్పించారు. మరి గత 5 ఏళ్లలో చంద్రబాబు ఎన్ని ఇళ్లు కట్టించారో ఎప్పుడైనా పవన్ ప్రశ్నించాడా అని అన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా పవన్ (Pawan Kalyan) మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగనన్న కాలనీలకు రూ.3 వేలు ఖర్చు పెడితే రూ.15 వేల కోట్ల అవినీతి ఎలా జరుగుతుందో అర్ధం కావడం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. జనసేన రాజకీయ పార్టీ కాదని, తాను జనసేనను పార్టీగా కూడా చూడడం లేదని ఎద్దేవా చేశారు. పేదలకు శాశ్వత ఇళ్లు నిర్మించాలనే లక్ష్యంతోనే జగనన్న కాలనీలను నిర్మిస్తున్నట్టు మంత్రి తెలిపారు.
జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న జగనన్న కాలనీలపై జనసేన లోపాలను ఎత్తి చూపిస్తుంది. జగనన్న ఇళ్లు - పేదలందరికీ కన్నీళ్లు' జనసేన సామాజిక పరిశీలన కార్యక్రమం చేపట్టారు. జగనన్న కాలనీల పేరిట పేదలకు జరిగిన మోసాన్ని నిలదీయండని ప్రజలకు పిలుపునిస్తున్నారు. అయితే జగనన్న ఇళ్లు - పేదలందరికీ కన్నీళ్లు' జనసేన సామాజిక పరిశీలన కార్యక్రమం వైజాగ్ నుండే మొదలు పెట్టడం గమనార్హం. ఇది రాష్ట్ర చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అని జగనన్న కాలనీల్లో అనేక అరాచకాలు జరిగాయని జనసేన విమర్శిస్తోంది. లబ్ధిదారుల కేటాయింపు పారదర్శకంగా జరగ లేదని, దీనిపై సోషల్ ఆడిట్ చేయనున్నారు. #JaganannaMosam అనే హ్యాష్ ట్యాగ్ తో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫైట్ స్టార్ట్ చేశారు. ఈరోజు వరకు 'జగనన్న ఇళ్లు - పేదలందరికీ కన్నీళ్లు' పేరుతో కార్యక్రమం#JaganannaMosam హ్యాష్ ట్యాగ్ తో ఫోటోలు, వీడియోలు అప్ లోడ్ చేయండని జనసేన కోరింది. ఈ క్రమంలో నిన్న పవన్ జగనన్న కాలనీలను పరిశీలించి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి ఘాటుగా స్పందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Botsa satyanarayana, Janasena party, Pawan kalyan, Ycp