అమ్మా! ఐ లవ్ యూ.. శ్రీదేవి జయంతి సందర్భంగా తిరుమలేశుడి సేవలో జాన్వి కపూర్..

శ్రీదేవి జాన్వీ కపూర్ (ఫైల్)

Janhvi Kapoor: అతిలోకసుందరి శ్రీదేవి 54వ జయంతి సందర్భంగా ఆమె కూతురు జాన్వి కపూర్ తన తల్లిని గుర్తు చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మామ్ చిత్రంలోని శ్రీదేవి చిత్రాన్ని పోస్ట్ చేసిన జాన్వి.. ‘హ్యాపీ బర్త్ డే అమ్మా, ఐ లవ్ యూ’ అని పోస్ట్ చేసింది.

  • Share this:
అతిలోకసుందరి శ్రీదేవి 54వ జయంతి సందర్భంగా ఆమె కూతురు జాన్వి కపూర్ తన తల్లిని గుర్తు చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మామ్ చిత్రంలోని శ్రీదేవి చిత్రాన్ని పోస్ట్ చేసిన జాన్వి.. ‘హ్యాపీ బర్త్ డే అమ్మా, ఐ లవ్ యూ’ అని పోస్ట్ చేసింది. అంతేకాదు.. శ్రీదేవికి ఇష్ట దైవం తిరుమల వేంకటేశ్వర స్వామిని జాన్వి దర్శించుకుంది. గుడి బయటకు వచ్చి మోకాళ్లపై కూర్చొని తలను భూమికి ఆనించి మొక్కుకుంది. ఈ సందర్భంగా జాన్వి తెలుగు సంప్రదాయ దుస్తులు.. లంగా ఓణిలో రావడం విశేషం. 
View this post on Instagram
 

💚


A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

కాగా, గతేడాది ఫిబ్రవరి 24న శ్రీదేవి కన్నుమూశారు. దుబాయ్‌లోని ఓ హోటల్‌ రూమ్‌ బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తుపడి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. మరోవైపు, శ్రీదేవి జయంతి సందర్భంగా సినీ ప్రముఖులు ఆమెకు నివాళి అర్పించారు.
View this post on Instagram

Happy birthday Mumma, I love you

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

Published by:Shravan Kumar Bommakanti
First published: