తిరుమల శ్రీవారి ఆలయంలోని పోటులో ప్రమాదం జరిగింది. పోటులోని బాయిలర్‌లో పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులకు గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా... మరో ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి. పులిహోర ప్రసాదం కోసం చింతపండు రసం వేడి చేస్తుండగా బాయిలర్‌లో పేలుడు సంభవించింది. ప్రసాదాలు తయారు చేసే వకుళమాట పోటులో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం సమయంలో మొత్తం 40 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. అయితే అధికారులు సరైన సమయంలో స్పందించడంతో పోటుతో పాటు ఇతర కార్మికులకు పెద్దగా నష్టం జరగలేదని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇక తిరుమలలో కొద్దిరోజుల క్రితం భక్తుల రద్దీ మళ్లీ పెరుగుతోంది. మరోవైపు నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా కారణంగా సాలకట్ల బ్రహ్మోత్సవాల తరహాలోనే నవరాత్రి బ్రహ్మోత్సవాలను సైతం టీటీడీ ఏకాంతంగా నిర్వహిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Tirumala Temple