గోదావరిలో 315 అడుగుల లోతుకు బోటు... తీయలేమంటున్న నేవీ

మునిగిపోయిన బోటు గోదావరి నదిలో దాదాపు 315 అడుగుల లోతులో ఉన్నట్టు గుర్తించారు. కానీ ఆ బోటును వెలికి తీయడం తమ వల్ల కాదని భారత నేవీ అధికారులు చేతులెత్తెస్తున్నారు.

news18-telugu
Updated: September 18, 2019, 10:01 AM IST
గోదావరిలో 315 అడుగుల లోతుకు బోటు... తీయలేమంటున్న నేవీ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పాపికొండలు వద్ద గోదావరి పడవ ప్రమాద ఘటనలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు పలు మృతదేహాల్ని వెలికితీశారు. అయితే పడవలో మరిన్ని మృతదేహాలు ఉండే అవకాశం ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంలో మునిగిపోయిన బోటు గోదావరి నదిలో దాదాపు 315 అడుగుల లోతులో ఉన్నట్టు గుర్తించారు. కానీ ఆ బోటును వెలికి తీయడం తమ వల్ల కాదని భారత నేవీ వర్గాలంటున్నాయి. ఇలాంటి ఆపరేషన్లలో సిద్ధహస్తుడిగా పేరుగాంచిన నేవీ అధికారి దశరథ్ సైతం ఇది అసాధ్యం అంటూ తేల్చేస్తున్నారు.

దీంతో ఆ బోటు పరిస్థితి ఏంటి. అందులో ఒకవేళ మృతదేహాలు చిక్కుకుంటే వాటిని ఎలా బయటకు తీసేది అన్న విషయం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. గోదావరి నదిలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తమకు 150 అడుగుల లోతు వరకు వెళ్లేందుకు మాత్రమే అనుమతి ఉందని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పుడు గోదావరి నదిలో ఉన్న పరిస్థితిని బట్టి అంత లోతుకు వెళ్లడం ఏమాత్రం క్షేమం కాదని నిపుణులు చెబుతున్నారు.

తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు మునక ఘటన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 39 మంది వరకు గల్లంతు కాగా, నిన్నటివరకు 26 మృతదేహాలను వెలికితీశారు. దేవీపట్నం వద్ద ఇవాళ మరో 5 మృతదేహాలను గుర్తించారు.  ప్రస్తుతం మృతుల సంఖ్య 31కి చేరింది.

First published: September 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు