Home /News /andhra-pradesh /

BLOW FOR AP GOVERNMENT IN NIMMAGADDA RAMESH KUMAR CASE AK

నిమ్మగడ్డ కేసు... సుప్రీం కోర్టులో జగన్‌ సర్కార్‌కు చుక్కెదురు

నిమ్మగడ్డ, వైఎస్ జగన్

నిమ్మగడ్డ, వైఎస్ జగన్

ఏపీ మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది.

    ఏపీ మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను ఏపీ ఎస్‌ఈసీగా కొనసాగించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లగా... ఇందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ బోబ్డే, న్యాయమూర్తులు జస్టిస్ ఏ. ఎస్.బోపన్న, జస్టిస్ హృషీకేశ్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. రాజ్యాంగ సంస్థలపైన ఆటలు తగవని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రతివాదులకు రెండు వారాల్లో నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Nimmagadda Ramesh Kumar, Supreme Court

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు