CM YS Jagan: ఏపీలో ఈ 132 వెబ్‌సైట్లను బ్లాక్ చేయండి.. కేంద్రానికి సీఎం జగన్ లేఖ

Online Betting: ఆన్‌లైన్ బెట్టింగ్, ఆన్‌లైన్ గేమింగ్, ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు పాల్పడటాన్ని నేరంగా పరిగణించే విధంగా ఏపీలో చట్టం చేశామని కేంద్రమంత్రికి రాసిన లేఖలో సీఎం జగన్ తెలిపారు.

news18-telugu
Updated: October 28, 2020, 9:58 PM IST
CM YS Jagan: ఏపీలో ఈ 132 వెబ్‌సైట్లను బ్లాక్ చేయండి.. కేంద్రానికి సీఎం జగన్ లేఖ
సీఎం జగన్(ఫైల్ ఫోటో)
  • Share this:
ఆన్‌లైన్ బెట్టింగ్, ఆన్‌లైన్ గేమింగ్, ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు పాల్పడే 132 వెబ్‌సైట్లను ఏపీలో నిషేధించాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించాలని ఏపీ సీఎం జగన్ కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు విజ్ఞప్తి చేశారు. ఆన్‌లైన్ బెట్టింగ్, ఆన్‌లైన్ గేమింగ్, ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు పాల్పడటాన్ని నేరంగా పరిగణించే విధంగా ఏపీలో చట్టం చేశామని తెలిపారు. ఈ మేరకు సీఎం జగన్ కేంద్రమంత్రి లేఖ రాశారు. ఈ రకమైన వాటి వల్ల సమాజంలో అనేక అనర్థాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. వీటికి అలవాటు కావడం వల్ల ఆత్మహత్యలు పెరిగిపోవడంతో పాటు అనేక మానసిక, సామాజిక రుగ్మతులు ఏర్పడుతున్నాయని కేంద్రమంత్రికి రాసిన లేఖలో సీఎం జగన్ పేర్కొన్నారు.

ఈ కారణంగానే వీటిని రాష్ట్రంలో నిషేధించేలా ఏపీ గేమింగ్ యాక్ట్ 1974లో సవరణలు చేశామని తెలిపారు. ఈ కొత్త చట్టం ప్రకారం ఇలాంటివన్నీ ఏపీలో శిక్షార్హమైన నేరాలని.. వీటికి నిర్వహించే కంపెనీల డైరెక్టర్లు కూడా శిక్షార్హులే అని వివరించారు. వీటికి సహకరించే వాళ్లు కూడా శిక్షార్హులే అనే విధంగా చట్టంలో మార్పులు చేశామని సీఎం జగన్ లేఖలో వెల్లడించారు. ఈ క్రమంలోనే వీటిని బ్లాక్ చేయని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు కూడా శిక్షార్హులే అవుతారని లేఖలో పేర్కొన్నారు. ఈ కారణంగానే ఏపీలో ఆన్‌లైన్ బెట్టింగ్, ఆన్‌లైన్ గేమింగ్, ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు పాల్పడే 132 వెబ్‌సైట్లను బ్లాక్ చేసే విధంగా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించాలని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ కోరారు.
Published by: Kishore Akkaladevi
First published: October 28, 2020, 9:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading