హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Fire Accident: తాడేపల్లిగూడెం సమీపంలో భారీ పేలుడు.. నలుగురు మృతి.. పలువురి పరిస్థితి విషమం ?

Fire Accident: తాడేపల్లిగూడెం సమీపంలో భారీ పేలుడు.. నలుగురు మృతి.. పలువురి పరిస్థితి విషమం ?

ఫేలుడు కారణంగా ఎగిసిపడుతున్న మంటలు

ఫేలుడు కారణంగా ఎగిసిపడుతున్న మంటలు

AP News: తాడేపల్లిగూడెం సమీపంలోని కడియం దగ్గర ఓ బాణాసంచా గోడౌన్‌లో పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తాడేపల్లిగూడెం(Tadepallegudem)  సమీపంలోని కడియం దగ్గర ఓ బాణాసంచా (Fireworks) గోడౌన్‌లో పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోయినట్టు తెలుస్తోంది. మరికొందరు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపిక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారు.

అప్పారావు అనే వ్యక్తి బాణాసంచా తయారు చేసే యూనిట్‌ను చాలాకాలం నుంచి నిర్వహిస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. గంట క్రితం ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు(Blast) సంభవించడం.. ఆ వెంటనే పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో అంతా భయభ్రాంతులకు గురయ్యారు. అయితే నిల్వ ఉన్న బాణాసంచాలో పేలుడు సంభవించిందా ? లేక ఉత్పత్తి చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందా ? అన్నది తెలియాల్సి ఉంది. ప్రమాదం జరిగిన సమంలో గోడౌన్ దగ్గర ఎనిమిది నుంచి పది మంది వరకు ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. కొందరు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు పక్కనే ఉన్న చెరువులో దూకినట్టు వెల్లడించారు.

Vizag: ఆంధ్ర యూనివర్సిటీలో దుకాణాలు నేలమట్టం.. బాధితుల కన్నీరు మున్నీరు

స‌మ‌స్య‌ల స‌ర్వే సాగుతూనే ఉంది..భూ స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ఎక్క‌డ దొరుకుతుంది?

ఈ ప్రమాదంలో నలుగురు చనిపోయినట్టు స్థానికులు ప్రాథమికంగా తెలిపారు. ఘటన జరిగిన వెంటనే స్థానిక ఆర్డీవో, ఎమ్మార్వో సహా పోలీసు అధికారులను ఘటనా స్థలం దగ్గరకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటికే అక్కడికి చేరుకున్న పైరింజన్లు మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. మంటలు పూర్తిస్థాయిలో వస్తే తప్ప.. ఘటనలో ఎంతమంది చనిపోయారు ? ఎంతమంది గాయపడ్డారనే దానిపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

First published:

Tags: Andhra Pradesh, Fire Accident

ఉత్తమ కథలు