కృష్ణాజిల్లాలోని ప్లైవుడ్ కంపెనీలో పేలుడు, తండ్రీకొడుకులు దుర్మరణం

గన్నవరం మండలం సూరంపల్లి లోని మహిళా పారిశ్రామిక వాడలోని ప్లైవుడ్ కంపెనీలో పేలుడు జరిగింది.

news18-telugu
Updated: September 3, 2020, 5:53 PM IST
కృష్ణాజిల్లాలోని ప్లైవుడ్ కంపెనీలో పేలుడు, తండ్రీకొడుకులు దుర్మరణం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కృష్ణా జిల్లాలోని ప్లైవుడ్ కంపెనీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులు దుర్మరణం చెందారు. గన్నవరం మండలం సూరంపల్లి లోని మహిళా పారిశ్రామిక వాడలోని ప్లైవుడ్ కంపెనీలో పేలుడు జరిగింది. స్క్రాప్ కొనుగోలు చేసేందుకు వచ్చిన తండ్రీకొడుకులు మృతి చెందారు. పేలుళ్ల ధాటికి మృతదేహాలు 50 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. మృతులు విజయవాడలోని వాంబే కాలనీకి చెందిన తండ్రీకొడుకులు అందవరపు కోటేశ్వరరావు, చిన్నారావుగా గుర్తించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 3, 2020, 5:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading