చిత్తూరు (Chittoor) జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. గంగాధర నెల్లూరు పోలీస్ స్టేషన్ (Gangadhara Nellore)లో అర్ధరాత్రి 3 గంటల సమయంలో భారీ శబ్దంతో బ్లాస్ట్ (Blast in Police Station) జరిగింది. ఈ ఘటనలో పోలీస్ స్టేషన్ ఆవరణలోని వాహనాలు ధ్వంసమయ్యాయి. పీఎస్ భవనంలోని అద్దాలు, కిటికీలు, తలుపులు కూడా దెబ్బతిన్నాయి. పేలుడు సమయంలో స్టేషన్‌లో ఉన్న ఏఎస్ఐ ఆంజనేయులు రెడ్డి, కానిస్టేబుల్ గజేంద్రకు స్వల్ప గాయాలు అయ్యాయి. పేలుడు శబ్దం వినిపించడంతో చుట్టుపక్కల ప్రజలు కూడా భయభ్రాంతులకు లోనయ్యారు. భారీ పేలుడుతో జనం ఉలిక్కిపడ్డారు. సమాచారం అందిన వెంటనే ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వెళ్లారు. పేలుడు ఎలా జరిగిందన్న దానిపై ఆరా తీస్తున్నారు.
పేలుడు సమయంలో పీఎస్‌లో నైట్ డ్యూటీలో ఇద్దరే ఉన్నారు. పగిలిన కిటికీ గాజు ముక్కలు, ఏఎస్ఐ ఆంజనేయ రెడ్డిపై పడడంతో ఆయనకు స్పల్ప గాయాలు అయ్యాయి. ఉదయం వేళ జరిగి ఉంటే.. పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నల్లమందు వల్లే ప్రమాదం జరిగిందని పోలీస్ అధికారులు వెల్లడించారు.
Tirumala: తిరుమల వెళ్లేందుకు సిద్ధమవుతున్న శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సూచన..
2018 జూన్‌లో గంగాధర నెల్లూరు పోలీసులు 713 కేజీల నల్లమందును సీజ్ చేశారు. దానిని అప్పుడే నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి నిర్వీర్యం చేశారు. ఐతే ఎఫ్ఎస్ఎల్ పరీక్షల కోసం 250 గ్రాముల నల్లమందును ఉంచారు. ఎఫ్ఎస్ఎల్ ప్రాసెస్ పూర్తయ్యాక.. పోలీస్ స్టేషన్ ఆవరణలోని మర్రిచెట్టు కింద పూడ్చిపెడ్చి.. దానిపై కాంక్రీట్ కూడా వేశారు. ఆ తర్వాత దాని గురించి పట్టించుకోలేదు.అది పేలుతుందని పోలీసులు భావించలేదు. కానీ, పూడ్చిపెట్టిన నాలుగేళ్ల తర్వాత అది భారీ శబ్దంతో పేలిపోయింది. ఘటనా స్థలంలో గొయ్యి ఏర్పడింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Chittoor