తూర్పుగోదావరిలో బాణాసంచా పేలుడు.. 9 మందికి గాయాలు

దీపావళి నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే బాణాసంచా తయారు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

news18-telugu
Updated: October 18, 2019, 6:30 PM IST
తూర్పుగోదావరిలో బాణాసంచా పేలుడు.. 9 మందికి గాయాలు
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: October 18, 2019, 6:30 PM IST
తూర్పుగోదావరి జిల్లాలో ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తాళ్లరేవు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బాణాసంచా తయారీ కేంద్రంలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా నిప్పు రవ్వలు ఎగిసిపడ్డాయని.. దాంతో అక్కడ నిల్వ చేసిన టపాసులు పేలి పెద్ద మొత్తంలో మంటలు వ్యాపించాయని స్థానికులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఐతే దీపావళి నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే బాణాసంచా తయారు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అలాంటి కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టంచేశారు.

First published: October 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...