Home /News /andhra-pradesh /

Black Magic: ఏజెన్సీలో చేతబడి కలకలం.. అనుమానంతో దాడి.. ముగ్గురు మృతి

Black Magic: ఏజెన్సీలో చేతబడి కలకలం.. అనుమానంతో దాడి.. ముగ్గురు మృతి

ఏజెన్సీలో బ్లాక్ మ్యాజిక్

ఏజెన్సీలో బ్లాక్ మ్యాజిక్

Black Magic: క్షుద్ర పూజలు.. చేత బడి.. పేరు ఏదైనా.. మూఢ నమ్మకాలు మాత్రం మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. తాజాగా విశాఖపట్నం ఏజెన్సీలో మరో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. చేతబడి అనుమానంతో జరిగిన దాడిలో ముగ్గురు మృతి చెందారు.

  Black Magic in Agency:  చిల్లంగి, చేతబడి, బాణామతి ఇలా పేర్లు అనేకం. కానీ.. ఇప్పటికీ ఈ పేర్లతో ఏజెన్సీలో గిరిజనం సావాసం చేస్తూనే ఉన్నారు. ఇంగ్లీష్ లో బ్లాక్ మ్యాజిక్ (Black Magic) అని పిలిచే ఈ వ్యవహారాన్ని గట్టిగా నమ్ముతున్నారు. విశాఖ ఏజెన్సీ (Visakha Agency) ని ఆనుకుని ఒడిషా (Odisha)కి దగ్గరగా ఉన్న గ్రామాలు.. అలాగే ఒడిశాలోని గ్రామాల ప్రజలు ఈ తంతును నమ్ముతున్నారు. ఈ మూడనమ్మకాలతో ఇప్పటికే ఒకర్నొకరు చంపుకుంటున్నారు. తాజాగా అరకు నియోజకవర్గం అనంతగిరి మండలం టోకూరు పంచాయతీ బగ్మారవలస గ్రామంలో చేతబడి కలకలం రేపింది. తమ కుటుంబం పై చేతబడి చేశారనే అనుమానంతో పరస్పరం దాడులు చేసుకోవడంతో ముగ్గురు మృతిచెందారు.  బగ్మారవలస గ్రామంలో చెడుపు చేస్తున్నారనే అనుమానంతో ఇరు కుటుంబాల మధ్య చెలరేగిన వివాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో మన్యంలో మూఢనమ్మకాలు మరోమారు చర్చనీయాంశమయ్యాయి.

  ఇలాంటి ఘటనలు ఇక్కడ కొత్తేం కాదు.  నిత్యం ఎక్కడో ఒక చోటు ఏజెన్సీలో జరుగుతూనే ఉంటాయి.  2015 నవంబరులో డుంబ్రిగుడ మండలం కితలంగి పంచాయతీ  రంగిసింగిగూడ గ్రామంలో ఓ తాంత్రికుడు ఇంటిపై స్థానికులు దాడి చేసి అతనిని సజీవదహనం చేశారు.

  ఇదీ చదవండి: వామ్మో నాటు సారా చెరువు.. పోలీసులకు సవాల్ విసురుతున్న గ్యాంగ్

  డుంబ్రిగుడ మండలం తూటంగి పంచాయతీ ఈసుకలు గ్రామంలో నాలుగు నెలల క్రితం చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో ఒక గిరిజనుడిని సాటి గిరిజనులే సజీవ దహనం చేశారు. అనంతగిరి మండలం చిలకలగెడ్డ పంచాయతీ పాటి గ్రామానికి చెందిన ఒక గిరిజనుడు, చిల్లంగి చేసి తన అన్నను చంపాడనే అనుమానంతో మరో గిరిజనుడిని అక్టోబరు 27న కాశీపట్నం సంతలో కత్తితో పొడిచి హత్య చేశాడు.

  ఇదీ చదవండి: ఈ ఇడ్లీ టేస్ట్ ఒక్కసారి చూస్తే చాలు.. మళ్లీ మళ్లీ తింటారు.. టేస్టే కాదు హెల్తీ కూడా

  జి.మాడుగుల మండలం గడుతూరు ప్రాంతంలో ఒక వ్యక్తిని గొడ్డలితో నరికి చంపేశారు. ముంచంగిపుట్టు మండలం రంగబయలు పంచాయతీ పట్నాపడాల్‌పుట్‌ ప్రాంతంలో ఓ వ్యక్తిని చెట్టుకు కట్టేసి బాణంతో చంపేశారు.
  పాడేరు మండలం మోదాపల్లి పంచాయతీ పందొర్లు గ్రామంలో చెడుపు చేస్తున్నాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని హత్య చేసి బావిలో పడేశారు.

  ఇదీ చదవండి: నేను ముఖ్యమంత్రి అయితే.. అన్ని ఇళ్లకు ఫ్రీగా ఇళ్ల పట్టాలు.. ఎప్పుడో కట్టిన ఇళ్లకు ఇప్పుడు పట్టా ఏంటి..? చంద్రబాబు ఫైర్

  తాజాగా అనంతగిరి మండలం టోకూరు పంచాయతీ బగ్మారవలస గ్రామంలో చేతబడి అనుమానంతో పరస్పరం దాడులు చేసుకోవడంతో ముగ్గురు మృతిచెందారు. నిరక్షరాస్యత, వెనుకబాటుతనం, తరతరాలుగా వస్తున్న ఆచారాలు, సంప్రదాయాల కారణంగా ఏజెన్సీలో గిరిజనులపై మూఢనమ్మకాల ప్రభావం  అధికంగా ఉంది. మూఢ నమ్మకాలపై ప్రభుత్వ యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పిస్తున్నప్పటికీ మారుమూల గ్రామాల్లో...ముఖ్యంగా ఒడిశాను అనుకుని వున్న ప్రాంతంలో ఇవి కొనసాగుతూనే ఉన్నాయి.

  ఇదీ చదవండి: లోకేష్ ను చంద్రబాబే ఓడించారా..? ఆ పదవికి అడ్డుపడతారని భావించారా..? మంత్రి సంచలన వ్యాఖ్యలు

  ఒడిషా ఆనుకుని వున్న గిరిజన ప్రాంతాల్లో మూఢనమ్మకాలను ఎక్కువగా పాటిస్తుంటారు. చిల్లంగి పూజలు, మంత్రాల నిర్వహణపై ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ఒడిశాలో పలు గురువులు ఉన్నారు. మూఢనమ్మకాలను విశ్వసించేవారు ఒడిశా వెళ్లి అక్కడ దిసారీ (మూఢనమ్మకాలకు పూజలు చేసే గురువు)గా శిక్షణ పొందుతుంటారు. తరువాత సొంత ఊరిలో  అనారోగ్య సమస్యలు, వ్యాధులు, దోషాల నివారణ పేరిట క్షుద్ర పూజలు చేస్తుంటారు. ఇతరులను ఇబ్బందులకు గురి చేసేందుకంటూ చెడుపు వంటి వాటిని నిర్వహిస్తుంటారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Black magic, Visakhapatnam

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు