హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

BJP vs YCP: జగన్ పాలనను కామెడీ సినిమాతో పోల్చిన బీజేపీ.., సంక్షేమ పథకాలపై సెటైర్లు..

BJP vs YCP: జగన్ పాలనను కామెడీ సినిమాతో పోల్చిన బీజేపీ.., సంక్షేమ పథకాలపై సెటైర్లు..

సోము వీర్రాజు, వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

సోము వీర్రాజు, వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వ పాలనపై ఏపీ బీజేపీ (BJP) నేతలు సెటైర్లు వేశారు. సీఎం జగన్ (AP CM YS Jagan)పాలన, బడ్జెట్ లో వ్యయాలను కామెడీ సినిమాతో పోలుస్తూ కౌంటర్లు వేశారు.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వ పాలనపై ఏపీ బీజేపీ (BJP) నేతలు సెటైర్లు వేశారు. సీఎం జగన్ (AP CM YS Jagan)పాలన, బడ్జెట్ లో వ్యయాలను కామెడీ సినిమాతో పోలుస్తూ కౌంటర్లు వేశారు. బుధవారం విజయవాడలో కేంద్ర బడ్జెట్ పై బీజేపీ ఆధ్వర్యంలో మేథావుల సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీలు సీఎం రమేష్, జీవీఎల్ నరసింహారావు, ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. కేంద్రం బడ్జెట్ పై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని... అందుకే మేధావుల తో సమావేశాలు నిర్వహిస్తున్నామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. విభజన జరిగాక ఎపీకి దిశ, దశ లేకుండా పోయిందని విమర్శించారు.

13 జిల్లాల్లో ఉన్న వనరులు, సముద్ర తీర ప్రాంతాలను వినియోగించుకోవాలని.., ఎపీకి రూ.3 లక్షల కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్దమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారని గుర్తుచేశారు. ఏపీని పాలించిన గత, ప్రస్తుత పాలకులు సరైన అంచనాలు వేయడంలో విఫలమయ్యారని.. రాష్ట్ర ఆర్ధిక ప్రగతిని సరైన మార్గంలో తీసుకెళ్లలేదని వీర్రాజు విమర్శించారు. నిర్మాణాత్మకమైన ఆలోచనలు చేయకపోవడం రాష్ట్ర అభివృద్ధికి అరిష్టమన్నారు. ఐదేళ్లలో చంద్రబాబు రాజధానిని కట్టలేదన్న వీర్రాజు.. తాను కడతాను అంటూ వచ్చిన జగన్ రాజధానే లేకుండా చేశారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పరిస్థితిని ప్రక్షాళన చేయడం ఒక్క నరేంద్ర మోదీకే సాధ్యమన్నారు.

ఇది చదవండి: అది ధార్మిక మండలి కాదు.. దోపిడీ మండలి..! టీటీడీ బోర్డుపై లోకేష్ సంచలన వ్యాఖ్యలు..


ప్రాంతీయ పార్టీ లు తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు కుట్రలు చేస్తున్నాయని ఎంపీ జీవిఎల్ నరసింహారావు మండిపడ్డారు. విభజనతో నష్టపోయిన ఏపీని ఆదుకునేందుకు మోదీ ఎన్నో నిధులిచ్చారని.. అబద్ధాలు ప్రచారం చేసే పార్టీలు చర్చకు సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. ఏపీకి రూ.2015-16 లో 27,990కోట్లు, 2020-21లో రూ.77,538 కోట్లు ఇచ్చారని.., మరో 40వేల కోట్లు గ్రాంట్ల రూపంలో మంజూరు చేశారని జీవీఎల్ గుర్తుచేశారు. ఆరేళ్లలో ఇన్ని నిధులు ఏ రాష్ట్రానికి ఇవ్వలేదని.., ఏపీపై మోదీకి అభిమానం ఉంది కాబట్టే నిధులు వచ్చాయన్నారు. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా15వేల కోట్ల రుణాన్ని కేంద్రం చెల్లించేలా అంగీకరించిందన్నారు. వీటి పై బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి సమాధానం చెప్పాలని జీవీఎల్ డిమాండ్ చేశారు.

ఇది చదవండి: కొడాలి నానిపై చంద్రబాబు కొత్త వ్యూహం..? ఆ ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?


బడ్జెట్ నుఎలా రూపొందించాలో కేంద్ర బడ్జెట్ ను చూసి నేర్చుకోవాలని.. అదే బడ్జెట్ ను ఎలా రూపొందించకూడదో తెలియాలంటే ఎపీ బడ్జెట్ ను చూడాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ సీఎస్ ఐవైఎఆర్ కృష్ణారావు అన్నారు. ఏపీ ప్రభుత్వం తీరు చూస్తే బెండు అప్పారావు సినిమా గురతొస్తోందని ఐవైఆర్ గుర్తుచేశారు. ఆదాయాలు చూసుకోకుండా డబ్బు ఖర్చు పెడితే బాగుపడినవాళ్లు లేరన్నారు. పథకాలకు జగన్ తన సొంత డబ్బును తెచ్చి పంచడం లేదని... రేపు ఈ భారంమొత్తం ఎపీ ప్రజలు మోయాల్సిందేనన్నారు. ఏపీ బడ్జెట్ కి... నిర్వహణకి అసలు సంబంధమే ఉండటం లేదన్న ఆయన.. ఒక్క బటన్ తో డబ్బులు వేశామంటూ జగన్ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.

First published:

Tags: Andhra Pradesh, Ap bjp, Ap cm ys jagan mohan reddy

ఉత్తమ కథలు