మోదీకి షాక్...చంద్రబాబు దీక్షకు బీజేపీ ఎంపీ, శివసేన మద్దతు

ఏపీ సీఎం ధర్మ పోరాట దీక్షకు కాంగ్రెస్, ఆమాద్మీ, ఎన్సీపీ, ఎస్పీ, శివసేనతో పాటు పలు విపక్షాలు మద్దతిచ్చాయి. బీజేపీ మిత్రపక్షం శివసేన కూడా దీక్షకు సంఘీభావం ప్రకటించడం ఇప్పుడు దేశరాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

news18-telugu
Updated: February 11, 2019, 7:22 PM IST
మోదీకి షాక్...చంద్రబాబు దీక్షకు బీజేపీ ఎంపీ, శివసేన మద్దతు
చంద్రబాబుతో శివసేన ఎంపీ సంజయ్, మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్, దిగ్విజయ్ సింగ్
  • Share this:
ఏపీ సీఎం చంద్రబాబు ధర్మపోరాట దీక్ష దేశ రాజకీయాల్లో సెగలు రేపుతోంది. ప్రత్యేక హోదాతో విభజన హామీలను అమలు చేయాలన్న డిమాండ్‌తో చంద్రబాబు చేపట్టిన దీక్షకు ఊహించని స్పందన వస్తోంది. కాంగ్రెస్‌తో పాటు పలు విపక్ష పార్టీలు చంద్రబాబు దీక్షకు మద్దతు తెలిపాయి. ఆ పార్టీలకు చెందిన ముఖ్య నేతలు స్వయంగా దీక్షాస్థలికి వచ్చి సంఘీభావం ప్రకటించారు. ఐతే చంద్రబాబు దీక్ష వేదికగా ప్రధాని మోదీ, అమిత్ షాకు బీజేపీ ఎంపీ షాకిచ్చారు. ఆ పార్టీ రెబల్ ఎంపీ శతృఘ్నన్ సిన్హా చంద్రబాబు పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందరర్భంగా ప్రధాని మోదీపై నిప్పులు చెరిగిన ఆయన...చంద్రబాబుపై ప్రశంసలు గుప్పించారు.

వ్యక్తి కంటే పార్టీ గొప్పది. పార్టీ కంటే దేశం గొప్పది. ఈ విషయం మోదీ తెలుసుకోవాలి. చౌకీదార్ ఏం చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసు. మోదీ వ్యాఖ్యలు ఆయనకు శోభ చేకూర్చవు. మోదీ వ్యాఖ్యలకు చంద్రబాబు ధీటుగా జవాబిచ్చారు. అన్యాయంపై గళమెత్తిన నాయకుడు చంద్రబాబు. ఢిల్లీలో ఇవాళ చంద్రబాబు హీరో అయ్యారు.
శతృఘ్న సిన్హా, ఎంపీ

అంతకు ముందు బీజేపీ మిత్రపక్ష శివసేన సైతం మోదీకి షాకిచ్చింది. ఢిల్లీలో చంద్రబాబు చేస్తున్న ధర్మపోరాట దీక్షకు శివసేన కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ స్వయంగా చంద్రబాబును కలిసి సంఘీభావం ప్రకటించారు. ఐతే ఆయన మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌తో కలిసి దీక్షాస్థలికి రావడం చర్చనీయాంశమైంది. వేదికపైనా వారితో కలిసివిడిగా ఉండడం ఎన్నో ఊహాగానాలకు తెరలేపింది.

కాగా, ఢిల్లీలో చంద్రబాబు దీక్ష వేళ విపక్షాలన్నీ మరోసారి ఏకమయ్యాయి. ఇటీవల కోల్‌కతాలో మమతా బెనర్జీ ఆధర్యంలో జరిగిన యునైటెడ్ ఇండియ సభకు విపక్షాల తరలివచ్చి..బీజేపీపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. తాజాగా చంద్రబాబు ధర్మపోరాట దీక్ష వేదికగా మరోసారి ఐకమత్యం ప్రదర్శించాయి. ఏపీ సీఎం ధర్మ పోరాట దీక్షకు కాంగ్రెస్, ఆమాద్మీ, ఎన్సీపీ, ఎస్పీ, శివసేనతో పాటు పలు విపక్షాలు మద్దతిచ్చాయి. బీజేపీ మిత్రపక్షం శివసేన కూడా దీక్షకు సంఘీభావం ప్రకటించడం ఇప్పుడు దేశరాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
First published: February 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...