శ్రీశైలంపై తెలంగాణకు హక్కులేదు.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

జీవో నెంబర్ 203 విషయంలో జగన్ వెనక్కి తగ్గొద్దని.. అవసరమైతే బీజేపీ తరపున తాను కేంద్రానికి విజ్ఞప్తి చేస్తానని చెప్పారు టీజీ వెంకటేష్.

news18-telugu
Updated: May 13, 2020, 3:04 PM IST
శ్రీశైలంపై తెలంగాణకు హక్కులేదు.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
శ్రీశైలం ప్రాజెక్టు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఏపీ, తెలంగాణ మధ్య జల జగడం ముదురుతోంది. రెండు ప్రభుత్వాల పరంగానే కాదు.. రాజకీయంగానూ దుమారం రేగుతోంది. ఈ క్రమంలో ఏపీకి చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు ఏపీ భూభాగంలో ఉందని.. ఆ ప్రాజెక్టుపై తెలంగాణకు ఎలాంటి హక్కులు లేవని అన్నారు. జీవో నెంబర్ 203 విషయంలో తెలంగాణ మూర్ఖంగా వ్యవహరించవద్దని..అలా జరిగితే తెలంగాణలోని ప్రతి ప్రాజెక్టు కూడా చట్ట విరుద్ధమేనని ఆరోపించారు టీజీ. తెలంగాణ భూభాగంలోని అన్ని భవనాలు, నిర్మాణాలు, ప్రాజెక్టులు తెలంగాణకే చెందుతాయని కేసీఆర్ అన్నారని.. అలాంటప్పుడు ఏపీ భూభాగంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు కూడా ఏపీకే చెందుతుందని స్పష్టం చేశారు. దానిపై తెలంగాణకు ఎలాంటి హక్కులుండవని చెప్పుకొచ్చారు. దీనిపై పోరాటమే తప్ప వెనక్కితగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు టీజీ వెంకటేష్. జీవో నెంబర్ 203 విషయంలో జగన్ వెనక్కి తగ్గొద్దని.. అవసరమైతే బీజేపీ తరపున తాను కేంద్రానికి విజ్ఞప్తి చేస్తానని చెప్పారు.
Ap news, Amaravati, tg venkatesh, bjp, ysrcp, tdp, ap politics, rayalaseema, kurnool, ఏపీ న్యూస్, అమరావతి, టీజీ వెంకటేశ్, బీజేపీ, వైసీపీ, టీడీపీ, రాయలసీమ, కర్నూలు
టీజీ వెంకటేష్

కాగా, కేఆర్ఎంబీ, అపెక్స్ కమిటీ అనుమతి తీసుకోకుండా కృష్ణా జలాల తరలింపుపై ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేయడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై కృష్ణా రివర్ బోర్డుకు ఫిర్యాదు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో శ్రీశైలం నుంచి నీటిని తరలించాలని అందులో ఉందని తెలంగాణ ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు. సంఘమేశ్వర పాయింట్ నుంచి 3 టీఎంసీలు,పోతిరెడ్డిపాడు నుంచి 88 వేల క్యూసెక్కుల నీటిని తరలించాలని జీవోలో ఉందని తెలిపారు. మొత్తంగా 8 టీఎంసీలకు ప్రపోజల్ పెట్టారని ఆయన తెలిపారు. ప్రస్తుతం పోతిరెడ్డి పాడు వ్యహహారం ఇరు రాష్ట్రాల రాజకీయాలను వేడెక్కింది.
Published by: Shiva Kumar Addula
First published: May 13, 2020, 3:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading