హోమ్ /వార్తలు /andhra-pradesh /

AP BJP: కోనసీమ కోసం రంగంలోకి బీజేపీ.. జగన్ సర్కార్ కు సోము వార్నింగ్..

AP BJP: కోనసీమ కోసం రంగంలోకి బీజేపీ.. జగన్ సర్కార్ కు సోము వార్నింగ్..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో బీజేపీ (BJP) జోరు పెంచింది. రాష్ట్రంలోని సమస్యల విషయంలో ప్రభుత్వంపై మాటల తూటాలు పేలుస్తోంది. కోనసీమ రైల్వేలైన్ కోసం తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) అమలాపురంలో బీజేపీ మహాధర్నా చేపట్టింది.

ఇంకా చదవండి ...

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో బీజేపీ (BJP) జోరు పెంచింది. రాష్ట్రంలోని సమస్యల విషయంలో ప్రభుత్వంపై మాటల తూటాలు పేలుస్తోంది. కోనసీమ రైల్వేలైన్ కోసం తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) అమలాపురంలో బీజేపీ మహాధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా రైల్వే ప్రాజెక్టుల్లో రాష్ట్ర వాటా ఇవ్వడలేదంటూ బీజేపీ నేతలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై, సీఎం జగన్ పై మండిపడ్డారు. కోనసీమ రైల్వేలైన్ కు రాష్ట్ర ప్రభుత్వం 25శాతం వాటా నిధులు విడుదల చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. మహాధర్నాలో ఏపీ బీజేపీ శ్రీసోము వీర్రాజు, ఎంపీ జీవిఎల్ నరసింహారావు, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. 52 కి.మీ.ల కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్ నిర్మాణానికి రూ.2,012 కోట్ల రూపాయల అంచనా వేయగా.. కేంద్రం తన వాటా నిధులన్నీ కేటాయించిందని.. ప్రస్తుత వైసీపీ, గత టీడీపీ ప్రభుత్వాలు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు.

    కోనసీమలో మూడు రైల్వే వంతెనల నిర్మాణానికి కేంద్రం రూ.1,048 కోట్లు ఖర్చు చేసిందని.. రాష్ట్ర ప్రభుత్వం వాటాలేక రైల్వే బ్రిడ్జి పనులు మందగించాయన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉండి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ ఇక్కడ బీజేపీకి బ్రాండ్ అంబాసిడర్ అంటూ సోము సెటైర్ వేశారు. రేషన్ కు రూ.10వేలకోట్ల సబ్సిడీని కేంద్రం ఇస్తుంటే కోనసీమ రైల్వేకు స్టేట్ షేర్ ఇవ్వడానికి ఇబ్బందేంటని ప్రశ్నించారు.

    ఇది చదవండి: మార్చి 7 నుంచి ఏపీ అసెంబ్లీ.. బడ్జెట్ కు ముహూర్తం ఫిక్స్

    పోలవరం ప్రాజెక్టు వేలకోట్లు ఇస్తుంటే కోనసీమ రైల్వే లైన్ కి రాష్ట్రం ఎందుకు సహకరించడం లేదని నిలదీశారు. బీజేపీ చేతిలో జగన్ కు బడితపూజఉంటుందని అందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. తమకు అధికారం ఇస్తే రాజధాని అమరావతిని నిర్మిస్తామన్నారు. కోనసీమ అభివృద్ధి రైల్వే లైన్ తో ముడిపడి ఉందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. వైసీపీ ఎంపీలు ఈ ప్రాంతం గురించి పార్లమెంటులో అడిగిన సందర్భాలు లేవన్నారు. కోనసీమ ను వైసీపీ నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రాజెక్టులు చేపడుతుంటే.. ఏపీలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని మండిపడ్డారు.

    ఇది చదవండి: వివేకా కేసులో మరో ట్విస్ట్... అందుకే హత్య..?

    వైసీపీ ప్రభుత్వం కోనసీమ ప్రజలను మోసం చేస్తోందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమ ప్రాంతంలో అందరూ తెలివైన వారని మా రాయలసీమలో అనుకుంటామని కానీ ఇక్కడి ప్రజలను వంచిస్తోందని ఆరోపించారు. 56 కిలో మీటర్ల రైల్వే లైన్ కి సీఎం జగన్ నిధులు ఎందుకు ఇవ్వడం లేదన్న ఆయన.. వైసీపీది అసమర్ధ ప్రభుత్వమని మండిపడ్డారు. 30 నెలల్లో ఈ రాష్ట్రానికి వైసీపీ ఏమీ చేయలేదని.. ప్రభుత్వం మెడలు వంచుతామని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.

    First published:

    ఉత్తమ కథలు