హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Mega Politics: మెగా బ్రదర్స్ మధ్య కషాయ చిచ్చు.. ఏపీలో బీజేపీ వ్యూహం వర్కౌట్ అయ్యేనా..?

Mega Politics: మెగా బ్రదర్స్ మధ్య కషాయ చిచ్చు.. ఏపీలో బీజేపీ వ్యూహం వర్కౌట్ అయ్యేనా..?

ఏపీలో బీజేపీ మెగా ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..?

ఏపీలో బీజేపీ మెగా ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..?

Mega Politics: బీజీపీని పవన్ పక్కన పెట్టారా.. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితంలో అది తేలిందా..? పవన్ వద్దనుకుంటే బీజేపీ వ్యూహం ఏంటి..? పవన్ కు మెగా బ్రదర్ తో చెక్క పెట్టాలి అనుకుంటున్నారా.. తమ్ముడికి వ్యతిరేకంగా అన్నయ్యను కమలం వాడుకోవాలి అనుకుంటోందా..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Mega Politics: ప్రస్తుతం జనసేన (BJP)తో బీజేపీ (BJP) పొత్తులో ఉంది.. అయితే పేరుకు పొత్తు అనిపిస్తోంది. రెండు పార్టీలు కలిసి ఎక్కడా పని చేయడం లేదు. కనీసం ఎన్నికల్లో ఒకరికి ఒకరు మద్దతు ఇవ్వడం లేదు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలే (MLC Elections) అందుకు నిదర్శనం. ఉత్తరాంధ్రుల పట్టభద్రుల ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్సీగా మాధవ్ పోటీ పడ్డారు. అయితే ఆయన ప్రచారం సందర్భంగా జనసేన మద్దతు తనకు ఉందని చెప్పుకున్నారు. అంతేకాదు ఓటు ఫర్ బీజేపీ అంటూ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫోటో కూడా పెట్టుకున్నారు. కానీ ఎక్కడా పవన్ మాత్రం మాధవ్ కు ఓటు వేయండి అని జనసైనికులకు పిలుపు ఇవ్వలేదు. మరోవైపు చాలామంది జనసైనికులు బీజేపీకి వ్యతిరేకంగా.. టీడీపీకి ఓట్లు వేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారం సంగతి ఎలా ఉన్నా..? ఇటీవల జనసేన అవిర్భావ సభలో పవన్ చేసిన వ్యాఖ్యలు సైతం బీజేపీని కలవర పాటుకు గురి చేసింది. పరోక్షంగా బీజేపీ పొత్తు ఉండదు అనే సంకేతాలు ఇచ్చారు.. టీడీపీ వైపే ఆయన మొగ్గు చూపుతున్నట్టు అర్థమవుతోంది.. మరి బీజేపీ ఎలాంటి వ్యూహంతో వెళ్తుంది..

పవన్ దూరం అవుతున్నట్టు సంకేతాలు అందడంతో బీజేపీ పెద్దలు అలర్ట్ అయినట్టే కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో కాపు ఓట్లను బీజేపీ టార్గెట్ చేస్తోంది. అందుకే ఇటీవల కాపుల గురించి ఎక్కువగా వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు మొన్నటి వరకు బీజేపీలో ఉన్న కీలక కాపు నేత కన్నా లక్ష్మీ నారయణ టీడీపీలోకి వెళ్లారు. ఇప్పుడు పవన్ కూడా దూరం అయితే.. కాపు ఓట్లపై బీజేపీ ఆశలు వదులుకోవాల్సి వస్తుంది. దీంతో బీజేపీ సరికొత్త వ్యూహానికి తెరలేపుతోంది.

కాపు ఓటర్లను దక్కరకు చేర్చుకోవాలి అంటే..? ఆ సామాజికి వర్గానికి చెందిన కీలక నేత పార్టీలోకి రావాల్సిన అవసరం ఉంది. అంతేకాదు పవన్ పొత్తు నుంచి బయటకు వెళ్తే.. అంతకన్నా జనాకర్షణ ఉన్న హీరో పార్టీకి అవసరం ఈ నేపథ్యంలోనే మెగా బ్రదర్ పై బీజేపీ కన్ను పడిందనే ప్రచారం ఉంది. అందులో భాగంగానే తాజాగా మెగా స్టార్ చిరంజీవి .. ఆయన తనయుడు రాం చారణ్ లను కేంద్రం హోం మంత్రి అమిత్ షా ప్రత్యేకంగా కలిసి ఉంటారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇదీ చదవండి : అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదా..? హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లే యోచనలో కడప ఎంపీ..?

ఆస్కార్ అవార్డు నెగ్గినందుకు రామ్ చరణ్ , ఆయన తండ్రి చిరంజీవిని కలిసినట్టు బీజేపీ నేతలు బయటకు చెబుతున్నప్పటికీ.. ఈ భేటీ వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పవన్ కు ధీటుగా బీజేపీ తరపున చిరంజీవిని రంగంలోకి దింపితే.. ప్లస్ అవుతుంది అన్నది బీజీపీ పెద్దల లెక్క అంటున్నారు. మరి తమ్ముడుకి వ్యతిరేకంగా మెగా బ్రదర్ చేతులు కలుపుతారా..? చిరంజీవిని బీజేపీ పెద్దలు అందుకు ఒప్పించగలుగుతారా..?

First published:

Tags: Amit Shah, Andhra Pradesh, AP Politics, Megastar Chiranjeevi, Pawan kalyan, Ram Charan

ఉత్తమ కథలు