Home /News /andhra-pradesh /

BJP MP SUJANA CHOWDARY FATHER JANARDHANA RAO PASSES AWAY AK

Sujana Chowdary: బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఇంట్లో విషాదం

సుజనా చౌదరి( ఫైల్ ఫోటో)

సుజనా చౌదరి( ఫైల్ ఫోటో)

Sujana Chowdary Father Passes Away: 1955లో సాగునీటిశాఖలో జూనియర్ ఇంజనీర్‌గా చేరిన జనార్ధనరావు.. ఆంధ్రప్రదేశ్‌లో పలు ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంలో పాలుపంచుకున్నారు.

    బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి యలమంచిలి జనార్ధనరావు ఈ రోజు కన్నుమూశారు. ఆయన వయస్సు 88 సంవత్సరాలు. కృష్ణా జిల్లా దోసపాడులో 1932 జనవరి 9న జన్మించిన జనార్ధనరావు కోయంబత్తూరులోని పిఎస్జీ కాలేజి నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పొందారు. అనంతరం 1955లో సాగునీటిశాఖలో జూనియర్ ఇంజనీర్‌గా చేరారు. ఆంధ్రప్రదేశ్‌లో పలు ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంలో పాలుపంచుకున్నారు. ముఖ్యంగా నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజి, శ్రీరామ్ సాగర్, కోయల్ సాగర్ గేట్ల నిర్మాణంలోనూ, వాటిని అమర్చడంలోను కీలకపాత్ర వహించారు.

    హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌లో బుద్ధ విగ్రహం ఏర్పాటు చేయడంలో నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనార్ధనరావుకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. ప్రభుత్వం తరపున ప్రత్యేక శిక్షణకు పలు యూరప్ దేశాలకు పంపించడం జరిగింది. ఇంజనీరింగ్ విభాగంలో ఉత్తమమైన సేవలందించినందుకు జనార్ధనరావుకు పలు అవార్డులు లభించాయి.

    Sujana Chowdary Father janardhana rao passes Away, sujana chowdary news, sujana chowdary father news, ap news, bjp mp sujana chowdary, సుజనా చౌదరి న్యూస్, బీజేపీ ఎంపీ సుజనా చౌదరి తండ్రి కన్నుమూత, సుజనా చౌదరి తండ్రి జనార్ధనరావు కన్నుమూల
    జనార్ధనరావు (ఫైల్ ఫోటో)


    జనార్ధనరావుకు భార్య సుశీల, నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. బీజేపీ ఎంపీగా కొనసాగుతున్న సుజనా చౌదరి జనార్ధనరావు చిన్నకుమారుడు. జనార్ధనరావు అంత్యక్రియలు జూబ్లీహిల్స్ విస్పర్ వ్యాలీలోని వైకుంఠ మహాప్రస్థానంలో ఉదయం 11.45 నిముషాలకు జరగనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Sujana Chowdary

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు